సొంత అజెండాను ప్రజల అజెండాగా భ్రమలు కల్పించారు

His own agenda was frowned upon by the people's agenda

His own agenda was frowned upon by the people's agenda

– మీట్‌ది ప్రెస్‌’లో రేవంత్‌ధ్వజం
Date:24/11/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
తెరాస అజెండానే ప్రజల అజెండాగా కేసీఆర్‌ భ్రమలు కల్పించారని, అన్ని వర్గాలను మభ్యపెట్టి తన వైపునకు తిప్పుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శించారు. తన మనుగడ కోసం నీళ్లు, నిధులు, నియామకాలు నినాదాన్ని తెరాస విస్తరింప జేసుకుందన్నారు.  నక్సలైట్ల ఎజెండానే తమ ఎజెండా అని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌.. అమాయక గిరిజన ప్రజలను అటవి ప్రాంతంలోకి తీసుకెళ్లి తూటాలతో హతమార్చారని. తెలంగాణ బిడ్డలైన శృతి, సాగర్, వివేక్‌ను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హతమార్చి .. అమాయకుల ఎన్‌కౌంటర్లతో ఈనేలను రక్తంతో తడిపారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ఆశించిన విధానానికి వ్యతిరేకంగా నేడు రాష్ట్రంలో పాలనలో సాగుతోందని ఆయన మండిపడ్డారు. ఓ సమయంలో తన కుమార్తె నిశ్చితార్థానికి తాను హాజరు కాకుండా అడ్డుకోవాలని చూశారని, అదేం రాక్షస ఆనందం అని ప్రశ్నించారు. తన ఒక్కగానొక్క బిడ్డ వివాహానికి కూడ తనను హాజరుకాకుండా అడ్డుకోవాలని టీఆర్‌ఎస్‌ నేతలు తనను జైల్లో పెట్టించారని గుర్తుచేశారు.ఎవరెన్ని కుట్రలు చేసినా చివరివరకు తాను ప్రజలు పక్షాన పోరాడుతానని రేవంత్‌ తేల్చిచెప్పారు. అలాంటి కేసీఆర్‌పై పోరాడే అవకాశం కాంగ్రెస్‌ పార్టీ తనకు కల్పించిందన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి తీరుతుందని.. తమ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలను సంక్షేమం దిశగా మార్చే విధంగా పాలన ఉంటుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ నాయకత్వాన్ని  నేరుగా ఎదుర్కొలేక టీఆర్‌ఎస్‌ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆయన పేర్కొన్నారు. తనకు విమర్శలు చేయడమే కాదు.. అవకాశం వస్తే పాలించడమూ వచ్చని వ్యాఖ్యానించారు. ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు. మావోయిస్టుల అజెండానే తన అజెండాగా చెప్పుకునే కేసీఆర్‌.. కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలని అనుకోవడం కూడా ఆ అజెండాలో ఉందా? అని ప్రశ్నించారు. ‘‘రేవంత్‌రెడ్డి తమను పరుష పదజాలంతో దూషిస్తున్నారని కేసీఆర్‌ కుటుంబం అంటోంది. పరుష పదజాలంతో విమర్శించింది కేసీఆరే. సోనియాగాంధీని అమ్మనా? బొమ్మనా? అని కేసీఆర్‌ దూషించడం వ్యక్తిగత విమర్శ కాదా? మా పిల్లలను కూడా దూషిస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. కేటీఆర్‌ కుమారుడిని విమర్శించాల్సిన అవసరం మాకు లేదు.
పాఠశాలకు వెళ్లే విద్యార్థి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం సరైందేనా? ప్రభుత్వం తరఫున భద్రాచలం రాములవారి వద్దకు సీఎం మనవడిని పంపించడం దేవుడిని అవమానించడం కాదా?’’ అని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం కేసీఆర్‌పై పోరాటం చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించింది. నన్ను, నా మిత్రులను పార్టీలో చేర్చుకుంది. రేవంత్‌రెడ్డికి విమర్శించడమే కాదు.. పాలన ఎలా చేయాలో కూడా తెలుసు. అవకాశం వచ్చినప్పుడు పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పులపై స్పష్టమైన ఆలోచనా విధానం ఉంది. రేవంత్‌రెడ్డికి ఏం అనుభవం ఉందని కొందరు అంటున్నారు. పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్‌కు, అత్యవసర పరిస్థితుల్లో ప్రధాని పదవి చేపట్టేటప్పుడు రాజీవ్‌గాంధీకి కూడా ఏం అనుభవం ఉంది. అలాంటిది ఎన్టీఆర్‌, రాజీవ్‌గాంధీ ప్రజాసేవలో ప్రజాదరణ పొందారు. విద్యార్థి ఉద్యమాలు, రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన అనుభవం నాకు ఉంది. పాలనాపరమైన అంశాల్లో సుస్పష్టమైన ఆలోచనా విధానం నా వద్ద ఉంది’’ అని రేవంత్‌ అన్నారు.
‘‘రైతుకు గిట్టుబాటు ధర కల్పించడమే శాశ్వత పరిష్కారం. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఉత్పత్తి చేసిన ప్రతి పంటను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రభుత్వ శాఖల్లోని అన్ని ఖాళీలను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2 నాటికి భర్తీ చేస్తాం. మారుమూల ప్రాంతం నుంచి మండల కేంద్రాలకు బీటీ రోడ్లు వేస్తాం. నర్సింగ్‌ కళాశాల అనుబంధంగా మండల కేంద్రానికో 50 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపడతాం’’ అని రేవంత్‌ వివరించారు. రేవంత్‌ ప్రసంగాన్ని కొనసాగిస్తూ..‘‘రాష్ట్రంలోని రైతులు, నిరుద్యోగులు, సామన్య ప్రజలు ఇలా అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం గురించి ప్రణాళికలను సిద్దం చేశాం. ముఖ్యంగా రైతులకు కేవలం రుణమాఫీ లాంటి విముక్తి కాకుండా పంటలకు గిట్టుబాటు ధరకు కల్పిస్తాం. ప్రతీ ఏడాది ఉద్యోగాల క్యాలెండర్‌ను  విడుదల చేస్తాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన నెలలోనే అని శాఖల నుంచి ఖాళీలను తెప్పించుకుని.. వచ్చే జూన్‌2 తెలంగాణ రాష్ట్ర దినోత్సవం సందర్భంగా కొత్త నియామకాలను చేపడతాం. జర్నలిస్టుల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని అన్నారు. 
Tags:His own agenda was frowned upon by the people’s agenda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *