ఆంధ్రప్రదేశ్‌లో హిట్లర్‌ పాలన నడుస్తోంది

Hitler's regime is running in Andhra Pradesh

Hitler's regime is running in Andhra Pradesh

– బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌
Date:22/10/2018
విజయవాడ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్‌లో హిట్లర్‌ పాలన నడుస్తోందని.. బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ఆరోపించారు. ప్రభుత్వ పాలనపై ప్రశ్నించే వారిని రాష్ట్ర ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ విజయవాడలో భాజపా చేపట్టిన ధర్మపోరాట దీక్షలో ఆయన మాట్లాడారు.అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉండాలని భాజపా నిర్ణయించిందని రాంమాధవ్‌ చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితుల పట్ల టీడీపీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. లక్షలాది కుటుంబాలు రోడ్డున పడటానికి ప్రభుత్వ వైఖరే కారణమని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొనడానికి ముందుకు వచ్చిన ఎస్ఎల్ గ్రూపును ప్రభుత్వం వెనక్కి పంపిందని తెలిపారు.
బాధితులు దిల్లీ వచ్చి మమ్మల్ని కలిశారని, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. అగ్రిగోల్డ్‌ కుంభకోణం వెనుక ఎవరున్నారో చెప్పాలని రాంమాధవ్‌ డిమాండ్‌ చేశారు.ఎన్నో ఆశలతో తెలంగాణలో తెరాసకు, ఏపీలో తెదేపాకు ప్రజలు అవకాశమిస్తే ఈ రెండు ప్రభుత్వాలూ అవినీతిమయం అయ్యాయని రాంమాధవ్‌ ఆరోపించారు. చీటికీ మాటికీ కేంద్రంపై తెదేపా నేతలు అపనిందలు వేస్తున్నారని, అర్ధరహితమైన డిమాండ్లు చేస్తున్నారని విమర్శించారు. గతంలో ప్రత్యేక ప్యాకేజీని ప్రశంసించిన చంద్రబాబు… ఇప్పుడు హోదా కోసం పోరాడుతున్నారని రాంమాధవ్ మండిపడ్డారు.  ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
గత ఎన్నికల్లో బీజేపీ లేకపోతే టీడీపీ గల్లంతయ్యేదని అన్నారు. గోబెల్స్ కు కూడా చంద్రబాబు గురువులాంటి వాడని ఎద్దేవా చేశారు. దేశంలో అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానంలో ఉందని అన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయడమే తమ ఆందోళన ఉద్దేశమని చెప్పారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని, గత మూడేళ్లలో అత్యధిక నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చాయని రాంమాధవ్‌ వివరించారు.టీడీపీ, కాంగ్రెస్ లు రెండూ ఒకే తాను ముక్కలని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో త్రిపుర ఫార్ములాను అమలు చేస్తామని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల తరహాలో ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని అన్నారు.
Tags:Hitler’s regime is running in Andhra Pradesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *