హమ్మయ్య…శ్రీ రెడ్డిపై మా నిషేధం ఎత్తివేత

Hmmm ... our ban on Sri Reddy is lifted

Hmmm ... our ban on Sri Reddy is lifted

Date:13/04/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
సీనీనటి శ్రీరెడ్డి పై మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ నిషేధాన్ని ఎత్తివేసింది. సీనియర్ నటుల సూచనల మేరకు శ్రీరెడ్డిపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు మా ప్రకటించింది. ఇటీవల శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేయడం, పలువురిపై ఆరోపణలు చేయడంతో ఆమెపై నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీరెడ్డి వ్యవహారం తలనొప్పిగా మారడంతో మా తన నిర్ణయాన్ని మార్చుకుంది. సినీ పరిశ్రమలో అవకాశాలు మా చేతులో లేదని, దర్శక, నిర్మాతలే అవకాశమిస్తారని మా అసోసియేషన్ తెలిపింది. సినీ పరిశ్రమలో మహిళల లైంగిక వేదింపుల అరికట్టడానికి కమిటీ అగినెస్ట్ సెక్సువల్ అరాస్ మెంట్ (క్యాష్) ను ఏర్పాటు చేసింది. అయితే తనపై నిషేధాన్ని తొలగించినా పోరాటం ఆపేదిలేదని శ్రీరెడ్డి స్పష్టం చేశారు.కాస్టింగ్ కౌచ్’ పేరుతో సినీ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయంటూ గత కొద్దిరోజులుగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది శ్రీ రెడ్డి. టాలీవుడ్‌లో అవకాశాల పేరుతో లొంగదీసుకుని తెలుగు అమ్మాయిలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్న శ్రీ రెడ్డి.. ఎలాగైనా ఈ చీకటి కోణాన్ని బయటపెడతానని ప్రకటించి కొద్దిరోజులుగా ఒక్కొక్కరి పేరు బయటపెడుతూ వస్తోంది. అయినా సరే దీనిపై ఎవరూ స్పందించక పోవటంతో చివరకు ఫిలిం చాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసి తన నిరసన వ్యక్తం చేసింది. ఈ నిరసన వల్ల ఆమెకు ఒరిగిందేమీ లేదు సరికదా ‘మా’ సభ్యులంతా ఆమెపై తీవ్రంగా విరుచుకుపడుతూ శ్రీ రెడ్డితో ‘మా’ సభ్యులెవరూ నటించకూడదని నిర్ణయించారు.
Tags: Hmmm … our ban on Sri Reddy is lifted

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *