జూన్ 30 వరకు పాఠశాలలకు సెలవులు పొడిగింపు

అమరావతి ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేసుల కట్టడి కోసం లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ విద్యా సంవత్సరం జూన్ 3తో ముగియనుంది. అయితేకరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించకుండానే జూన్ 30 వరకు మరోమారు సెలవులను పొడిగించింది. ఇక జూన్ 30 తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోన్నుట్లు తెలుస్తోంది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Holidays extended to schools until June 30

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *