Natyam ad

శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా ముగిసిన హోమ మహోత్సవాలు

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నెల రోజుల పాటు నిర్వహించిన హోమ మహోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి.
ఉదయం శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరిగింది. అనంతరం మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మ‌హాశాంతి అభిషేకం, కలశాభిషేకం, త్రిశూల‌స్నానం, అంకురార్పణ విసర్జన నిర్వహించారు.సాయంత్రం లక్షదీపారాధన, పంచమూర్తులైన శ్రీవిఘ్నేశ్వరస్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి, శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీచండికేశ్వరస్వామి వారికి ఆరాధన నిర్వహించారు.ఆ త‌రువాత పంచమూర్తులకు కొలువు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో  దేవేంద్రబాబు, ఏఈఓ పార్థసారధి, సూప‌రింటెండెంట్  భూపతి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

Tags: Homa mahotsavams concluded grandly at Sri Kapileswara Temple

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.