ఇంటి దొంగలు అరెస్ట్

కడపముచ్చట్లు:

 

 

పోలీసుల వాహానాల తనీఖీల్లో ఇళ్లకు కన్నం వేసే ఇంటి దోంగల గుట్టు రట్టైంది. కడప జిల్లా బద్వేల్ పట్టణం ఎరుకల కాలనీ, ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎరుకల కాలనీకి చెందిన రామాంజనేయులు, మద్దెల వెంకట రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి లక్షా 60వేల రూపాయలు విలువ చేసే 20 గ్రాముల బంగారు ఆభరణాలు, మోటార్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని నగరంలోని ఎస్పీ కార్యాలయ ఆవరణంలో మీడియా ఎదుట హాజరు పరచి వివరాలని ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. బద్వేల్ పట్టణం శీలంవారిపల్లె క్రాస్ వద్ద వాహానాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇరువురిని విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు వెల్లడించారు. మాటల్లో పెట్టి దోంగతనాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags:Home burglars arrested

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *