పుంగనూరులో ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలి – ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

పేద ప్రజల కోసం నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయించాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కోరారు.గురువారం ఎంపీడీవో లక్ష్మీపతి, హౌసింగ్‌ ఈఈ రమేష్‌రెడ్డి, మంత్రి పీఏ చంద్రహాస్‌తో కలసి గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలోని 23 పంచాయతీల్లో 2,346 మందికి ఇండ్లు కేటాయించడం జరిగిందన్నారు. వీరిలో రెండవ విడతలో పనులు చేస్తున్న వారికి తక్షణమే బిల్లులు చెల్లించాలన్నారు. అలాగే పనులు ప్రారంభించకుండ పెండింగ్‌లో ఉన్న వారికి అవగాహన కల్పించి, పనులు ప్రారంభించాలన్నారు. ప్రభుత్వాదేశాల మేరకు నిర్ధేశించిన గడువు మేరకు పనులను పూర్తి చేయించే భాధ్యతను సచివాలయ ఉద్యోగులు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు చూడాలన్నారు.సమస్యలు లేకుండ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయించేందుకు ఆయా ప్రాంత సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. లబ్ధిదారులకు అవసరమైన మెటిరియల్‌ను అందజేయడం జరుగుతుందని తెలిపారు. లబ్ధిదారులు తక్షణమే ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి జ్ఞానప్రసన్న, ఏఈ దీనదయాల్‌, వైస్‌ ఎంపీపీ ఈశ్వరమ్మ తో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Home construction should be completed in Punganur – MP Akkisani Bhaskar Reddy

Post Midle
Natyam ad