పుంగనూరులో ఇంటి వద్దకే ఆర్టీసీచే సరుకులు డెలీవరి

పుంగనూరు ముచ్చట్లు:

ఆర్టీసి బస్సుల ద్వారా ఏప్రాంతం నుంచి ఏప్రాంతంకైనా సరుకులు డెలీవరి చేసే కార్యక్రమాలను ప్రారంభించినట్లు డీఎం సుధాకరయ్య తెలిపారు. మంగళవారం ఈ మేరకు కరపత్రాలను ఆర్టీసీ కార్మికులతో కలసి విడుదల చేశారు. డీఎం మాట్లాడుతూ గుర్తింపు పొందిన 84 పట్టణాలకు సరుకులు బుక్‌చేసి, వినియోగదారులకు అందించే కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందుకు గాను కిలో నుంచి 6 కేజిల వరకు గల పార్శిల్‌కు రూ. 18 లు చార్జీలు వసూలు చేస్తామన్నారు. అలాగే 6 నుంచి 10 కేజిల వరకు రూ.36 లు, 25 నుంచి 50 కేజిల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఆగస్టు 24 వరకు ఆర్టీసీ కార్గో డోర్‌డెలీవరి పై ప్రచార మహ్గత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఆర్టీసీ సేవలు వినియోగించుకుని సహకరించాలని కోరారు.

 

Tags: Home delivery of goods by RTC in Punganur

Leave A Reply

Your email address will not be published.