అర్హులందరికి ఇళ్లు

Home for all deserves

Home for all deserves

Date:14/09/2018
ప్రకాశం ముచ్చట్లు :
రాష్ట్రంలోని పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర సమాచార,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారంనాడు డోర్నలా వెలుగోడు ప్రాజెక్టు అతిధి గృహంలో జరిగిన పాత్రికేయ సమావేశంలో ఎర్రగుంట పాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజ్ తో కలిసి మంత్రి మాట్లాడుతూ పేదలకు సొంతింటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్హత కల్గిన వారందరికి ఇప్పటికే 13లక్షల ఇళ్లను నిర్మాణం పూర్తి చేసి అదనంగా5లక్షలదాకా ఇళ్లను మంజూరు చేయాలనిర్ణయం తీసుకున్నారు అని తెలిపారు.
అలాగే ప్రకాశం జిల్లాలో 51,33.ఇల్లు మంజూరు కాగా 28,624 ఇల్లు పూర్తి కావడం జరిగిందని రూ 300కోట్ల ఖర్చు చేసినట్లుగా మంత్రి తెలిపారు. దేశంలో మునుపు ఎన్నడూ లేనంతగా ఏపీ ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు స్ఫూర్తితో ఆయన పేరు మీద ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి రూ.1.50లక్షలు,పట్టణ ప్రాంతాల్లో రూ.2.50 లక్షల రూపాయల తో ఇళ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు తమ ప్రభుత్వం చేపట్టిన ట్లు మంత్రి  తెల్పినారు.
ఎస్సి, ఎస్టీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఈమధ్య కాలంలో నిధులు మంజూరు చేశారని .ఎస్సిలకు రూ.50,000 ఎస్టీలకు రూ.లక్ష రూపాయల వరకు మంజూరు, అర్హత గల జర్నలిస్టు లకు  కూడాఇళ్ల నిర్మాణం మంజూరు చేస్తూన్నట్లు మంత్రి  తెలిపారు. అర్హత కల్గిన వారందరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Tags:Home for all deserves

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *