Natyam ad

హోంగార్డ్ సేవలు ప్రశంసనీయం…

హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
– వై. రిశాంత్ రెడ్డి
60వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన చిత్తూరు జిల్లా పోలీసులు

చిత్తూరు ముచ్చట్లు:

60వ హోంగార్డుల ఆవిర్భవ దినోత్సవం కార్యక్రమంను ఏఆర్  పోలీసు పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్ పి  వై.రిశాంత్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. పెరేడ్ ను పరిశీలించి హోంగార్డుల ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడ పోటిలలో విజేతలైన వారికి, హోంగార్డ్ విధుల్లో ప్రతిభ కనబరచిన హోంగార్డ్ లకు సర్టిఫికెట్స్, మొమెంటోలు బహుకరించారు. ఈ సందర్భంగా ఎస్ పి  మాట్లాడుతూ మన దేశంలో హోం గార్డ్ వ్యవస్థ 1946 సంవత్సరంలోనే ప్రారంభం అయ్యిందని ఆ తర్వాత 1963 వ సంవత్సరంలో డిసెంబర్ 6 వ తేదీన ఈ వ్యవస్థ బాధ్యతాయుతమైన పౌరులు సమాజానికి స్వచ్చంధ సేవ చేయు కొరకు పురుడు పోసుకుందని తెలిపారు. ఈ హోంగార్డ్ వ్యవస్థ స్వచ్చంధ సేవ దృక్పధంతో ఏర్పడినది, కమ్యూనిటీ పోలీసింగ్ లో ఒక భాగం అని, హోంగార్డ్స్ ప్రజలకి పోలీసులకి వారధులుగా పని చేయాలని తెలిపారు. పోలీసులతో పాటు ఏమాత్రం తీసిపోని విధంగా హోంగార్డులు సేవలు అందిస్తుండటం అభినందనీయమన్నారు. పోలీసుశాఖ క్రమశిక్షణకు మారుపేరని… నిత్యం క్రమ శిక్షణతో మెలుగుతూ పోలీసు ప్రతిష్టను పెంచేలా విధులు కొనసాగాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే క్రమంలో అంకితభావంతో పని చేయాలన్నారు. అవినీతికి దూరంగా ఉండాలన్నారు. చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతల కోసం 661 మంది హోంగార్డ్స్ విధులను నిర్వహిస్తున్నాట్లు. వీరితో పాటు 227 హోంగార్డ్స్ వివిధ విభాగాల నందు డెప్యుటేషన్ మీద పని చేస్తున్నారని తెలుపుతూ హోంగార్డ్స్ పోలీసు వారితో సమానంగా ట్రాఫిక్ రెగ్యులేషన్, శాంతి భద్రతల పరిరక్షణలో మరియు నేరాలను ఆరికట్టడంలో పోలీసులకు వెన్నుదన్నుగా ఉంటున్నారని, హోంగార్డ్స్ రాష్ట్రములో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు,

 

 

Post Midle

పండుగలు, వి.ఐ.పి. & వి.వి.ఐ.పి. పర్యటనలకు వచ్చు సందర్భములలో పోలీసులకు వారి యొక్క సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, హోంగార్స్డ్ రైసింగ్ డే  సందర్భంగా ప్రదర్శించిన పెరేడ్ అద్బుతంగా వుందని అభినందిస్తూ హోంగార్డ్స్ అందరికి శుభాభినందనలు తెలియజేస్తూ, వారికొరకు చిత్తూరు పోలీసు శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం అమలు జరుపుతున్న పలు సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిత్తూరు జిల్లా నందు హోంగార్డ్స్ బెనిఫిట్ ఫండ్ ను సహాయంతో ఎవరైనా హోంగార్డ్స్ గాయపడిన రూ 30,000, మరణించినా తక్షణ సహాయంగా రూ 4 లక్షలు మరియు వారు రిటైర్ అవుతున్నప్పుడు  రూ 4 లక్ష రూపాయలతో కానుకలు ఇచ్చి ఘనంగా సన్మానించి  పంపుతున్నాం.  ఈ మధ్య కాలంలో అనారోగ్యం కారణంగా హోం గార్డ్స్ మరణించడం జరిగింది. అందువలన ప్రస్తుతం హోం గార్డ్ యూనిట్ నందు 249 మంది 40 సం. పై బడిన వారు ఉన్నారు వీరికి త్వరలో మెడికల్ టెస్ట్ లు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సం. చిత్తూరు జిల్లాలో చనిపోయిన 2 హోం గార్డ్స్ ల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున అందించామని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన అధికారులను ఎస్పీ  అభినందిస్తూ జ్ఞాపికలతో సన్మానించారు.

 

Tags: Home Guard services are commendable…

Post Midle