Natyam ad

ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన హోంమంత్రి  వనిత

నూజివీడు ముచ్చట్లు :


రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత బుధవారం నాడు ఆగిరిపల్లి పోలీసు స్టేషన్ ను ప్రారంభించారు. ఈ  కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఐజీ పాలరాజు, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, సబ్ కలెక్టర్ ఆదర్శ్, స్థానిక వైస్సార్సీపీ నాయకులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు.  మంత్రి మాట్లాడుతూ ఆగిరిపల్లి లో నూతన పోలీస్ స్టేషన్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.సీఎం జగన్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ పారదర్శకంగా, నిబద్ధతతో పనిచేస్తోంది. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ సత్పలితాలను ఇస్తోంది. ప్రజలకు పోలీసుల పనితీరు పట్ల పూర్తి నమ్మకం కలిగిందని అన్నారు. ఆగిరిపల్లి పోలీసుల సేవలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని సూచించారు.

 

Tags: Home Minister Vanitha inaugurated Agiripalli Police Station

Post Midle
Post Midle