ఇంట్లో దొంగతనం.. రూ.15 లక్షల చోరీ

గుంటూరు  ముచ్చట్లు:
 
చిలకలూరిపేట పట్టణం లోని పండరీపురం 1వ లైన్ లో సంక్రాంతి పండుగ రోజు ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఆర్టీసీ కండక్టర్ సుబ్బారావు కుటుంబ సభ్యులు పండగ సందర్భంగా బంధువుల ఇంటికి వెళ్ళారు.ఇది గమనించిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించే పదిహేను లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించారు.కనుమ పండగ రోజు రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన సుబ్బారావు కుటుంబ సభ్యులు.. దొంగతనం జరిగినట్లు గుర్తించి చిలకలూరిపేట అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు.క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించింది పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Home theft .. Rs 15 lakh theft

Natyam ad