పందులకు నిలయం ఈ ప్రయాణ ప్రాంగణం మూత్రశాలలకు పరిమితమైన మల్యాల ఆర్ టీ సి బస్టాండ్ చొప్పదండి

Date:15/07/2020

న్యూస్ పల్స్ ముచ్చట్లు:

లక్షల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన బస్టాండ్ పందులకు మూత్రశాలలకు నిలయంగా మారి చెత్తాచెదారంతో మల్యాల ప్రయాణ ప్రాంగణం నిండిపోయింది. జగిత్యాల జిల్లాకు చెందిన చొప్పదండి నియోజక వర్గంలోని మల్యాల మండల కేంద్రంలోని ఆర్ టీ సి బస్టాండ్ దుస్థితి.దుర్ఘంద వాసనతో నిరుయోగంగా ఉన్న ఆర్ టీ సి బస్టాండ్ దగ్గరలోనే పెగడపెల్లి వైపు పోయే రహదారి పిచ్చి చెట్లతో ఉండటంతో వాహన దారులు బాటసారులు దుర్ఘంద వాసనతో ఇబ్బంది పడుతున్నారు. మల్యాల మండల కేంద్రంలో ఆర్ టి సి బస్సులు పూర్వకాలం నుండి అంగడి బజార్ లోని మర్రిచెట్టు దగ్గర ఆపుకోని ప్రయానికులను తీసుకొని పోతున్నారు. ఇక్కడ నుండి ప్రతి నిత్యం పెగడపెల్లి మండలం, చొప్పదండి మండలం, జగిత్యాల జిల్లా కేంద్రానికి ఆర్ టీ సి బస్సులలో ప్రయానికులు రాకపోకలు కొనసాగిస్తుంటారు.

 

అంగడి బజార్ లో సరియైన స్థలం లేక బస్ లు తిరగాలంటే ఇబ్బందిగా మారింది దానికి తోడు చుట్టుప్రక్కల చిన్న చిన్న దుకాణాలు ఆటోలు ఉండటంతో ఆర్ టీ సి బస్సులకు మరింత ఇబ్బందిగా మారింది. కనీసం ప్రయానికులకు మూత్రశాలలు కూడ లేవు.ఇక్కడి పరిస్థితిని గమనించిన అప్పటి ప్రజా ప్రతి నిధులు మల్యాల మండల కేంద్రంలో పెగడపెల్లి దారిలో ఆర్ టీ సి బస్టాండ్ ను నిర్మాణం చేసారు. 4-10- 2001 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆద్వర్యంలో రాష్ట్ర పర్యాటక మరియు చక్కెర శాఖ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి చేతుల మీదుగా మల్యాల బస్టాండ్ ను శంకు స్థాపన చేసారు. తెలుగు దేశం ప్రభుత్వంలో ఉన్న జగిత్యాల నియోజక వర్గ ఎం ఎల్ ఏ టీ జీవన్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ సిమితా డావ్రా, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ రాజేశ్వరరావు పలువురు మల్యాల మండల ప్రజా ప్రతి నిదులు అధికారులు పాల్గొన్నారు. కాని ఇంత వరకు ఉపయోగంలోకి తీసకరావడంలో ప్రజా ప్రతి నిధులు, ఆర్ టీ సి అధికారులు చొరవ చూపకపోవడంతో లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆర్ టీ సి బస్టాండ్ నిరుపయోగంగామారి అందులో పందులు బస చేస్తున్నాయి.

 

 

మూత్రశాలలకు నిలయంగా మారింది. చెడిపోయిన వాహనాలకు అడ్డాగా మారింది. ప్రజా ప్రతి నిదులు శంకుస్థాపన చేసిన శిలాఫలకం కనిపించకుండా పిచ్చి చెట్లతో నిండిపోయింది. కనీసం ఇప్పటికైనా ప్రజా ప్రతి నిధులు,ఆర్ టీ సి అధికారులు స్పందించి మల్యాల బస్టాండ్ ను ఉపయోగంలోకి తీసుక రావాలని బస్టాండ్ కు ప్రహారీ గోడ నిర్మాణ పనులను చేపట్టాలని ఎంపిటీసి రాచర్ల రమేష్, బీజేపి నాయకులు గుండెటీ గంగారాం,రుత్త కిషన్ పలువురు గ్రామస్తులు ప్రయానికులు కోరుతున్నారు..

 

చిన్నారికి మూడో కన్ను…యుగాంతమేనా

Tags:Home to Pigs This travel complex is restricted to bathrooms.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *