పుంగనూరులో 9న టిట్కోగృహాల గృహప్రవేశాలు
-ఇళ్లను పరిశీలించిన కలెక్టర్ షన్మోహన్
పుంగనూరు ముచ్చట్లు:

పట్టణ సమీపంలోని గూడూరుపల్లెలో నిర్మించిన 1532 టిట్కో గృహాలను ఈనెల 9న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా టిట్కో గృహాలను జిల్లా కలెక్టర్ షన్మోహన్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. రోడ్లు, విద్యుత్, పైపులైన్లు, నీటి ట్యాంకుల నిర్మాణాల పనులను కలెక్టర్ పరిశీలించారు. పేదలందరికి ఇల్లు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గంలో గృహప్రవేశ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. మిగిలిన గృహనిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేయించాలన్నారు. లబ్ధిదారులు నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. త్వరలోనే గృహ ప్రవేశాలకు సిద్దం చేయాలని సూచించారు. ఈ విషయమై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎస్‌ఈ జాన్‌సైమన్‌రావు, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా కూడ గృహాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ పద్మనాభం, ఎస్‌ఈ చంద్రశేఖర్, మెప్మాపీడీ రాధమ్మ, మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి, తహశీల్ధార్ సీతారామన్ పాల్గొన్నారు.
Tags: Home visits of Titkogrihas on 9th in Punganur
