పుంగనూరు జగనన్న కాలనీలలో ఉగాధికి గృహప్రవేశాలు – కమిషనర్ నరసింహప్రసాద్
పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్నకాలనీలలో ఉగాధి పండుగకు గృహప్రవేశాలు నిర్వహించేలా నిర్మాణాలు వేగవంతం చేసినట్లు కమిషనర్ నరసింహస్రాద్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఉదయం 6 గంటలకు జగనన్న కాలనీలలో ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ హరినారాయణ్ ఆదేశాల మేరకు ప్రతి రోజు ఉదయం ఇండ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తూ లభ్ధిదారులతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం 1525 గృహాలు మంజూరు కాగా, 448 ఇండ్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన గృహాలు పనులు వేగవంతంగా జరుగుతోందన్నారు. అలాగే 1536 టిట్కో గృహాల రిజిస్ట్రేషన్ల పక్రియ పూర్తి చేసి, గృహప్రవేశాలకు సిద్దం చేశామన్నారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు నిర్మాణాలకు అవసరమైన సామాగ్రీ అందిస్తూ ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. కాలనీలలో రోడ్లు, పైపులైన్లు, విద్యుత్‌లైన్లు, మురుగునీటి కాలువలు నిర్మాణాలు వేగవంతం చేశామని , ఉగాధికి సిద్దం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ హేమంత్ పాల్గొన్నారు.

Tags: Home visits to Ugadhi in Punganur Jagananna Colonies – Commissioner Narasimhaprasad
