Natyam ad

పండుగల గృహప్రవేశాలు- మంత్రి పెద్దిరెడ్డి, కలెక్టర్‌ షన్మోహన్‌ ఆధ్వర్యంలో సంబరాలు

పుంగనూరు ముచ్చట్లు:

ఎన్నడు లేని విధంగా పుంగనూరు పట్టణంలో సామూహిక గృహప్రవేశ కార్యక్రమాలు పండుగ వాతావరణంలో నిర్వహించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ షన్మోహన్‌, ఎంపీ రెడ్డెప్ప , జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులతో కలసి పుంగనూరులోని గూడూరుపల్లె వద్ద నిర్మించిన 1536 ఇండ్లను, 732 జగనన్న కాలనీల గృహాలను మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు వేల సంఖ్యలో హాజరై మంత్రి పెద్దిరెడ్డికి, జిల్లా కలెక్టర్‌కు మహిళలు నీరాజనాలు పలికారు. బాణసంచాలు, మేళతాళాలతో పండుగ వలే గృహప్రవేశ కార్యక్రమాలను నిర్వహించారు. ఇండ్లకు మామిడి తోరణాలు కట్టి , గుమ్మడికాయ దిష్టితీసి కొట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సామూహిక గృహప్రవేశాలు వైభవంగా నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి లబ్ధిదారు దంపతులకు నూతన వలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేసి, పాలు పొంగించారు. ఈ సందర్భంగా 1536 మంది లబ్ధిదారుల ఇండ్ల తాళాలతో మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, రెడ్డెప్ప, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

నిర్మాణాలు…

పట్టణంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వెనుక భాగంలో టిట్కో గృహాలను సుమారు రూ.10 కోట్లు విలువ చేసే 5 ఎకరాల భూమిలో 1536 గృహాలు నిర్మించారు. 31 బ్లాకులుగా ఏర్పాటు చేశారు. ఒకొక్క ఇంటికి రూ. 6లక్షలు ఖర్చు చేసి సుందరంగా నిర్మించారు. ఇందు కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.99.49 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇండ్ల నిర్మాణాలను ఎంతో నాణ్యత ప్రమాణాలతో నిర్మించారు. 30 అడుగుల వెడల్పు గల సిమెంటు రోడ్లు, కాలువలు నిర్మించారు. అలాగే ఓవర్‌హెడ్‌ ట్యాంకుల ద్వారా పైపులైన్లు వేసి ఇంటింటికి కొళాయిల ద్వారా నీరు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి వద్ద టిట్కో, జగనన్న కాలనీల కోసం ఇండ్లకు సిమెంటు రోడ్డు వేసి ఆర్చి నిర్మించారు. రోడ్లకు ఇరువైపులా వెహోక్కలు నాటి జగనన్న పచ్చతోరణం ఏర్పాటు చేశారు. టిట్కో కాలనీ ప్రాంతంలో విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయడంతో సుందర పట్టణంగా రూపాంతరం చెందింది.

అంతా ఉచితం…

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిట్కో లభ్ధిదారుల వద్ద నుంచి ఒకొక్కరి వద్ద రూ.2.65 లక్షలు వసూలు చేసేలా విడుదల చేసిన జీవో 58ను రద్దు చేశారు. అంతా ఉచితంగా ప్రజలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించి నిర్మాణాలను చేపట్టారు. ప్రస్తుతం లభ్ధిదారులు ఒక్కరూపాయి కూడ చెల్లించకుండ సుమారు రూ.15 లక్షలు విలువ చేసే ఇల్లు , స్థలాన్ని రిజిస్ట్రర్‌ చేసి లభ్దిదారుల పేరున ఇస్తుండటంతో లబ్దిదారుల ఆనందాలకు అవదులు లేకుండ పోయింది. రాష్ట్రంలో ఏముఖ్యమంత్రి చేయని విధంగా జగనన్నపాలనలో ప్రతి ఒక్కరికి పక్కాగృహాలు నిర్మించి ఇవ్వడం జరుగుతోందని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

1221 సంఘాలకు రుణాలు పంపిణీ ….

పట్టణంలోని మహిళా సంఘాలకు 1221 మహిళా సంఘాలకు రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్‌ షన్మోహన్‌ కలసి సుమారు రూ.25 కోట్ల రూపాయల సున్నా వడ్డి చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళలందరు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించి ఓట్లు అడగాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అయ్యేలా ఆశీర్వదించాలని కోరారు.

ఆర్‌వో ప్లాంట్లు ప్రారంభం….

పట్టణంలోని ప్రజలకు రక్షిత మంచినీటిని అందించేందుకు నాలుగు ఆర్‌వో ప్లాంట్లను మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఒకొక్క ప్లాంటును సుమారు రూ.2.50 లక్షలతో ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి నిర్మించారు. పట్టణంలోని ఏటిగ డ్డపాళ్యెం, తాటిమాకులపాళ్యెం, కొత్తపేట, యూబికాంపౌండులో నిర్మించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, చైర్మన్‌ అలీమ్‌బాషా, కౌన్సిలర్‌ కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Homecomings of festivals- Celebrations under the leadership of Minister Peddireddy and Collector Shanmohan

Post Midle