Date:08/04/2020
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు సమీపంలో ఏర్పాటు చేసిన ఆదిత్యా ఇంజనీరింగ్ కళాశాల క్వారంటైన్ సెంటర్ నుంచి 31 మందిని ఇండ్లకు పంపినట్లు ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు తెలిపారు. గత 14 రోజుల క్రితం పుంగనూరు, సోమల నుంచి సెంటర్కు పంపడం జరిగిందన్నారు. సెంటర్లో ఉన్న వారందరికి వైద్యపరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. అందరు ఆరోగ్యంగా ఉండటంతో ఇండ్లకు తరలించామన్నారు. ఇండ్లలో కూడ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఐ గంగిరెడ్డి, డిప్యూటి తహశీల్ధార్, మాదవరాజు, అంజుమన్ కమిటి కార్యదర్శి అమ్ము, మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్షరీప్ పాల్గొన్నారు.
Tags: Homes from Quarantine Center, Punganoor