శాంతికి నిలయాలు గురుద్వారాలు    

-జిల్లాపరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్

మంథని  ముచ్చట్లు:

Post Midle

సిక్కుల పవిత్ర స్థలాలైన గురుద్వారాలు శాంతికి నిలయాలని పెద్దపల్లి జిల్లాపరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. బుధవారం నాందేడ్ లోని తాఖత్ సచ్ కండ్ గురుద్వారాను ఆయన స్థానిక బహుజన నాయకులతో కలిసి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిక్కుల పదవ మత గురువు గురుగోవింద్ సింగ్ తుదిశ్వాస విడిచిన ప్రదేశంలో నిర్మించిన ఈ గురుద్వారను సిక్కులు పరమ పవిత్రంగా భావిస్తారని తెలిపారు. సర్వమతాలను గౌరవించే సిక్కులు తాము పవిత్రంగా భావించే గురుద్వారల ద్వారా శాంతిని బోధిస్తారని మతసామరస్యానికి వారు ప్రతీకలని పేర్కొన్నారు. మహనీయుల జన్మస్థలాలు, కర్మ స్థలాల సందర్శనతో పాటు సర్వమతాలకు సంబంధించిన పుణ్యస్థలాలను స్థానిక నాయకులతో కలిసి సందర్శిస్తూ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అయన వెంట నాయకులు జక్కు రాకేష్, పూదరి సత్యనారాయణ గౌడ్, తగరం శంకర్ లాల్, శీలారపు లక్ష్మన్, అజ్మీర పూల్ సింగ్, అజ్మీర సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Homes to peace are gurudwaras

Post Midle
Natyam ad