ఇళ్ల స్థలాలు వేగవంతం

Date:03/07/2020

డోన్  ముచ్చట్లు:

ఇళ్ల స్థలాలు పనులు ముమ్మరంగా వేగవంతం జరుగుతున్నాయి అనీ డోన్ యం ఆర్ ఓ నరేంద్రనాథ్ రెడ్డి అన్నారు, స్థానికంగా డోన్ పట్టణం ,దొర పల్లె, ఉడుములపాడు దగ్గర ఇంటి స్థలాల కోసం చేసే పనులు వేగవంతంగా ఉన్నాయి, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నవరత్నాలను ప్రజలందరికీ అందజేయడం కొరకు ఎంతో శ్రమిస్తోంది, ప్రతి ఒక్క వ్యక్తికి సొంత ఇల్లు ఉండాలనే కల సహజం అయితే ఆర్థిక పరిస్థితి లేని వాళ్ళు ఇంటి స్థలాలు లేక అద్దె ఇళ్లలో కాలం గడుపుతున్నారు.ఇలాంటి నిజమైన అర్హులందరికీ ఇంటి స్థలాలు కేటాయించడమే ప్రభుత్వ ధ్యేయం, అందులో భాగంగానే డోన్ పట్టణం మరియు రూరల్ లో ఇంటి స్థలాలు లేని ప్రజల వివరాలను గ్రామ సభల ద్వారా తీసుకోవడం జరిగింది, ఇందులో డోన్ పట్టణం నుంచి 3900 మందిని, రూరల్ నుంచి 1456 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది,వీరందరికీ ఇంటి స్థలాల కోసం ఆన్లైన్ మరియు డిజిటల్ సిగ్నేచర్ చేసి  వాటన్నిటి ద్వారా సర్వే చేయడం జరిగింది,ఇందుకుగాను దొరపల్లె దగ్గర 55 ఎకరాలు ఉడుములపాడు దగ్గర 40 ఎకరాలు స్థలాన్ని తీసుకొని ప్రతి లేఔట్లు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఇంటర్నల్ రోడ్స్ న ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ ద్వారా చేయడం జరుగుతుంది. దాదాపు 95 శాతం పనులు పూర్తయ్యాయి. శనివారం సాయంత్రం లోపు ఉడుములపాడు దగ్గర 40 ఎకరాలలో పని పూర్తవుతుంది,దొర పల్లె దగ్గర ఉన్న 20 ఎకరాలలో పని ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతుంది. ఇంటి పట్టాలను అందరికీ 8 వ తారీకు జరిగే పేదల ఇంటి స్థలాలు కార్యక్రమం నందు పంపిణీ చేయడం జరుగుతుందని డోన్ యం ఆర్ ఓ నరేంద్ర నాథ్ రెడ్డి తెలియజేశారు.

కెసిఆర్ ఆలోచన భావితరాలకు ఉపయోగం

Tags:Homespaces are fast

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *