ఉధ్యమ ఉపాధ్యాయులకు సత్కారం

Honest to medium teachers

Honest to medium teachers

Date:21/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

సీపీఎస్‌ రద్దు కోరుతూ అసెంబ్లి ముట్టడికి వెళ్లి అరెస్ట్ కాబడిన ఉధ్యమ ఉపాధ్యాయులకు శుక్రవారం పట్టణంలో సత్కారం చేశారు. స్థానిక ఎంఆర్‌సి కార్యాలయంలో ఎస్టీయు గౌరవ అధ్యక్షులు సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ పోలీసులు అసెంబ్లి ముట్టడికి వెళ్లకుండ , అడ్డుకుని అరెస్ట్లు చేస్తున్నా భయపడకుండ, స్థానిక ఉపాధ్యాయ నేతలు మోహన్‌, గురు , నారాయణ, ప్రభాకర్‌, బుడ్డన్న, వెంకటరెడ్డి, అనిల్‌, నరేంద్ర, శరత్‌బాబు, నారాయణరెడ్డి, సుధాకర్‌, జమీల్‌బాషా, శ్రీనివాసులు, వెంకటేష్‌లు అమరావతికి వెళ్లి అక్కడ పోరాటం చేయడం.

 

ఉపాధ్యాయుల ఐకమత్యానికి నిదర్శనమన్నారు. సిపిఎస్‌ను రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్‌రెడ్డి, భాస్కర్‌, అయూబ్‌, కేశవ, శంకర్‌, రెడ్డెప్ప, శివశంకర్‌, కె.రెడ్డెప్ప, సోమశేఖర్‌, బాలాజి, క్రిష్ణమూర్తి, నాగేంద్ర, బాలరాజు, ప్రసాద్‌బాబు, కుమార్‌, దేవకుమార్‌, చంద్రశేఖర్‌రెడ్డి, ప్రకాష్‌రావు తదితరులు పాల్గొన్నారు.

29న హరిహరమఠం పీఠాధిపతులు రాక

Tags:Honest to medium teachers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *