కర్ణాటకలో హనీ ట్రాప్ కలకలం

Honey trap in Karnataka

Honey trap in Karnataka

Date:05/12/2019

బెంగళూరు ముచ్చట్లు :

కర్ణాటకలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను ట్రాప్‌ చేసిన హనీట్రాప్‌ కేసులో కొందరు సినీ హీరోయిన్లకు కూడా సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శాండల్‌వుడ్‌కు చెందిన ముగ్గురు నటీమణుల పాత్ర ఇందులో ఉన్నట్లు సీసీబీ పోలీసులు విచారణలో గుర్తించినట్లు తెలిసింది. ఒకరు ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ కాగా, మరో ఇద్దరు రెండు, మూడు సినిమాల్లో నటించిన వారని సమాచారం. మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించి త్వరలోనే వారిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరు సుమారు 25కు పైగా చిత్రాల్లో పలువురు ప్రముఖ హీరోలతో నటించిన హీరోయిన్‌గా భావిస్తున్నారు. మరో తార చిన్న సినిమాలు టీవీ సీరియళ్లు, రియాల్టీ షోలలో కనిపించారు. ఇక మూడో నటి బహుభాషా చిత్రాల్లో నటించిన హీరోయిన్‌గా గుర్తించారు. వారం క్రితం బహిర్గతమైన హనీట్రాప్‌ బాగోతంలో పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల శృంగార వీడియోలు బయటపడ్డాయి. రాఘవేంద్ర అనే వ్యక్తి తన ప్రియురాలు, కొందరు యువతులను ఎమ్మెల్యేల వద్దకు పంపి పరిచయాలు పెంచుకున్నాడు. వారితో నాయకులు గడుపుతున్న రహస్య వీడియోలు సేకరించి భారీగా డబ్బు డిమాండ్‌ చేయడం, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది.కర్ణాటకలో తీవ్ర కలకలం రేపుతున్న రాజకీయ నాయకుల శృంగార వీడియోల వెనుక ఓ టాప్ సీనియర్ హీరోయిన్ తో పాటు, మరో ఇద్దరు నటీమణులు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన నటితో పాటు, ఈమధ్య కాలంలో రెండు మూడు సినిమాల్లో నటించిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీలను హనీట్రాప్ చేశారని, వారితో శృంగారం జరుపుతూ వీడియోలు చిత్రీకరించారని భావిస్తున్న పోలీసులు, ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించే పనిలో ఉన్నారు. మిగతా ఇద్దరిలో ఓ నటి చిన్న సినిమాలు, టీవీ సీరియళ్లు, రియాల్టీ షోలలో కనిపించగా, మూడో నటి కన్నడతో పాటు ఇతర సినిమాల్లోనూ కనిపించిందట. గత వారం ఈ హనీట్రాప్ వ్యవహారం బయటకు వచ్చింది. చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల వీడియోలు బయటకు వచ్చాయి. ఈ కేసులో రాఘవేంద్ర అనే వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.

 

నామినేటెడ్ పదవుల పందేరం షురూ…

 

Tags:Honey trap in Karnataka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *