చంద్రగిరిలో పరువు హత్య
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారి పల్లిలో పరువు హత్య చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థిని మోహనకృష్ణ ఆత్మహత్య విషయంలో సంచలనం విషయాలు వెలుగులకి వచ్చాయి. ప్రేమ విఫలమై జూలై 7వ తేదీ ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందిందని కుటుంబ సభ్యులు పిర్యాదు చేసారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మర్డర్ గా నిర్థారణ అయింది. గొంతు నులిమి చంపేశారని నివేదిక వచ్చింది. కులాలు వేరు కావడంతో ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. కుటుంబ సభ్యులు హత్య చెసి ఉంటారరని పోలీసుల అనుమానం. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు.
Tags: Honor killing in Chandragiri

