Honorable O for sanitation workers

పారిశుధ్య కార్మికులకు సన్మానO

Date:08/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు టౌన్ మార్కెట్ యార్డ్ నందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  మునిసిపాలిటీ పారిశుధ్య కార్మికులను దుశ్యాలవాలు కప్పి సన్మానించడం జరిగింది. అదే విధంగా నిత్యావసర సరుకులు 5 రకల కూరకాయలు బియ్యం పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు బి నరసింహులు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు ముఖ్యంగా మన రాష్ట్రంలో తగిన గుర్తింపు లేదని వారికి సంఘంలో గౌరవ మర్యాదలు లేవని ఉద్యోగ భద్రత లేదని తెలిపారు. వీరు సంఘంలో అందరికంటే ఎక్కువగా సేవచేసి మలినాలను తొలగించి సంఘానికి గొప్పగా సేవ చేస్తున్నారని తెలిపారు. వీరియొక్క కుటుంబాల ఆర్థిక పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని వారి యొక్క కుటుంబాల గురించి ఆలోచించే నాయకులు లేరని వాపోయారు.భవిష్యత్తులో వీరికి శ్రీ మందకృష్ణ మాదిగ  నాయకత్వంలో ఎమ్మార్పీస్ శ్రేణులన్నీ వీరికి అండగా నిలబడి ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో MEF నాయకులు సి.శంకర, ఎమ్మార్పీస్ సీనియర్ నాయకులు రమణ,AMC రెడ్డెప్ప,అమర,నాగభూషణం,అన్నమయ్య మిద్దింటి పృథ్విరావు  R. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

స్థానికులకు మాత్రమే కేదార్ నాధ్ దర్శనానికి అనుమతి

Tags: Honorable O for sanitation workers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *