పుంగనూరులో జాతీయ గీతానికి గౌరవ వందనం

Honorary Salute to National Song in Punganoor

Honorary Salute to National Song in Punganoor

-ప్రజలలో ప్రారంభమైన దేశభక్తిభావం

Date:17/08/2018

పుంగనూరు ముచ్చట్లు:

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పుంగనూరులో ప్రారంభించిన జనగణమన జాతీయ గీతానికి పట్టణ ప్రజలు మూడువ రోజు భక్తితో వందనం చేశారు. కమిషనర్‌ కెఎల్‌.వర్మ , సీఐ సాయినాథ్‌, ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి , జెఏసి చైర్మన్‌ వరదారెడ్డి , ఎస్టీయు నాయకుడు రవి, ఆర్యవైశ్య సంఘ నాయకుడు బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు, పోలీసులు, విద్యార్థులు, ప్రజలు జనగణమన కమిటి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

గోకుల్‌ సర్కిల్‌, ఇందిరా సర్కిల్‌లో 7:59 గంటలకు దారం కట్టి రోడ్డుపై నిలబడ్డారు. 8 గంటల సమయంలో పోలీస్‌ సైరన్‌తో జనగణమన గీతం ప్రారంభమైంది. ఆర్టీసి బస్సులు, ప్రెవేటు వాహనాలు, పట్టణ ప్రజలు 52 సెంకడ్ల పాటు రోడ్డుపై ఎక్కడివారు అక్కడే నిలబడి జాతీయ గీతాలాపన పూర్తికాగానే గౌరవ వందనం చేశారు.

 

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు ఇలాగే ముందుకు రావాలని కమిటి సభ్యులు పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, పి.అయూబ్‌ఖాన్‌, వి.దీపక్‌, ఎన్‌.ముత్యాలు, సివి.శ్యామ్‌ప్రసాద్‌, కె.రెడ్డిప్రసాద్‌, ఎం.బాబు, కుమార్‌రాజు, శ్రావణ్‌కుమార్‌తో పాటు లయన్స్ క్లబ్ ప్రతినిధులు గిరి, ఇంతియాజ్‌, కుమార్‌, నాగరాజ, పిడిఎఫ్‌ అధ్యక్షుడు బుక్యాభానుప్రసాద్‌, వెంకటేష్‌, దళిత సంక్షేమ సంఘ నాయకులు శంకరప్ప, రాజ , వైఎస్సాఆర్సీపి నాయకులు జయరాం, చందారెడ్డెప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎం ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగులపై చిన్న చూపు

Tags; Honorary Salute to National Song in Punganoor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *