మంత్రి సోమిరెడ్డికి సత్కారం

Honoring Minister Sommareddy

Honoring Minister Sommareddy

Date:23/10/2018
నెల్లూరు ముచ్చట్లు:
మనుబోలు మండలంలో బండేపల్లి బ్రాంచ్ కెనాల్ కింద సాగుకు ఇబ్బందికరంగా ఉందని రైతుల వినతి మేరకు ప్రయత్నం చేశాం. కోరిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు డేగపూడి-బండేపల్లి కాలువ నిర్మాణానికి అంగీకరించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. మనుబోలు మండల రైతుల చిరకాల కోరిక అయిన డేగపూడి-బండేపల్లి లింక్ కెనాల్ నిర్మాణానికి రూ.31.40 కోట్లు మంజూరు చేయిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు తెప్పించినందుకు  కాగితాలపూరు రోడ్డులో మంత్రిని రైతులు, పార్టీ నేతలు ఘనంగా సత్కరించారు. మంత్రి మాట్లాడుతూ 148 ఎకరాల భూసేకరణకు మార్చిలో రూ. 10.30 కోట్లు విడుదల చేశారు. నిబంధనల ప్రకారం పీఎన్ తో పాటు డీడీ పబ్లిష్ చేసేశాం.
కండలేరు వాగు నుంచి కాలువ తవ్వేందుకు కూడా నిధుల మంజూరుకు ఆర్థికశాఖ ఉత్తర్వులిచ్చిందని అన్నారు..నిరంతరం పర్యవేక్షించి నిధుల మంజూరుకు కృషి చేశాం. ఆయకట్టు విషయంలో తెలుగు గంగ అధికారులు కొన్ని సందేహాలు లేవనెత్తడంతో అన్నీ నివృత్తి చేసి నిధులు సాధించాం.  జీఓ విడుదల కాగానే ఇరిగేషన్ అధికారులు టెండర్ ప్రక్రియ చేపడుతారు. అటు కనుపూరు కాలువ నుంచి సోమశిల నీళ్లు, ఇటు బండేపల్లి కాలువ ద్వారా కండలేరు నీటితో ఎలాంటి భయం లేకుండా పంటలు పండించుకునే అవకాశం వస్తుందని అన్నారు. ఆమంచర్ల వద్ద కనుపూరు కాలువ డీప్ కట్ క్లియర్ చేసేందుకు రూ.15 కోట్లతో క్లియరెన్స్ వచ్చింది.
టీడీపీ అధికారంలోకి వచ్చాక నాలుగు ప్రధాన ప్రాజెక్టులు సాకారం చేశాం. 24,500 ఎకరాలకు నీళ్లు అందించేందుకు కండలేరు ఎడమకాలువ ఎత్తిపోతల పథకం అందుబాటులోకి తెచ్చాం. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న దక్షిణ కాలువను పూర్తి చేసి 10 వేల ఎకరాలు నీరు అందించనున్నాం. డేగపూడి-బండేపల్లి కాలువ, కనుపూరు కాలువ డీప్ కట్టింగ్ తో మనుబోలు మండలం సశ్యశామలం కాబోతోందని మంత్రి అన్నారు. వీటితో పొదలకూరుతో పాటు మనుబోలు మండలాలు పూర్తిస్థాయి డెల్టాగా మారుతాయి. ఓడిపోయి నేను చేస్తుంటే ప్రజల ఓట్లతో గెలిచి పదవులు వెలగబెట్టిన వారు ఈ ప్రాజెక్టులను ఎందుకు చేయించలేకపోయారు. రైతుల కోసం బాధ్యతగా పనిచేసి ఈ ప్రాజెక్టులు సాధించానని అన్నారు.
Tags:Honoring Minister Sommareddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *