Natyam ad

ఆ ఇద్దరిపైనే ఆశ, శ్వాస

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అధికారంలో ఉన్న తెరాసను ముచ్చటగా మూడో సారి గెలిపించి మరో సారి ముఖ్యమంత్రి కావాలన్న కేసీఆర్ లక్ష్యనికి  ప్రజలలో కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత అవరోధం అయ్యే అవకాశలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీకి ఏంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉండటం సహజం. అయితే టీఆర్ఎస్ విషయంలో ఈ సారి అది కొంచెం ఎక్కువగా ఉందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం.    దీనిని గమనించిన సీఎం ప్రభుత్వ వ్యతిరేకతను అధిగ మించి సానుకూలతను పెంచుకునే దిశగా కసరత్తులు ప్రారంభించారు. రాజకీయ వ్యూహరచనలో దిట్ట అయిన తెలంగాణ ముఖ్యమంత్రి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వ సానుకూలతగా మార్చుకునేందుకు  అందుబాటులో ఉన్న అన్ని వనరులూ వినియోగిం చుకుంటున్నారు.   ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో పేచీ విషయంలో ఒక అడుగు తగ్గి రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం సేకరణకు ముందుకు రావడం దీనిలో భాగమేనని చెప్పవ చ్చు. అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వ వ్యతిరేక వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆ వర్గాలలో ప్రభుత్వ సానుకూలత పెరిగేలా చర్యలు తీసుకోవడంపై కేసీఆర్ దృష్టి పెట్టారు. ఇవన్నీ కాకుండా ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు ఆయన  అధికారులను ముఖ్యంగా ప్రమోటీ (కన్ఫర్డ్) ఐఏఎస్ లను రంగంలోనికి దింపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేతకకు కారణాలేమిటి? వ్యతిరేకతను అధిగమించి ఆ వర్గాలను ప్రభుత్వ అనుకూలత దిశగా మార్చడానికి తీసుకోవలసి చర్యలేమిటి? అన్న దానిపై అధ్యయనం చేయడమే కాకుండా అందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా ఇప్పటికే వారికి అవసరమైన సూచనలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఏ ఏ అంశాలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది.

 

 

దానికి తగ్గించడానికి ప్రభుత్వ పరంగా తీసుకోవలసిన చర్యలేమిటి వంటి విషయాలపై సహజంగానే ఐఏఎస్ లకు ఉండే అవగాహనను కేసీఆర్ అందిపుచ్చుకుని ముందుకు సాగాలని భావిస్తున్నారు. అలాగే దళిత బంధు వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తూ తద్వారా  ఆయా వర్గాలలో ప్రభుత్వ సానుకూలత పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక తెలంగాణ సెంటిమెంటును మళ్లీ ప్రజలలో రేకెత్తించి తెరాసయే తెలంగాణ ప్రగతికి పాటుపడే పార్టీ అన్న భావనను పెంపొందించేందుకు తెలంగాణ పట్ల కేంద్ర వివక్షను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.పోరుగు రాష్ట్రంలో సౌకర్యాల లేమిని ఎత్తి చూపడం ద్వారా సమర్థ పాలనతో తెలంగాణ అభివృద్ధి పథంలో పరుగులు తీస్తన్నదన్న విషయాన్ని జనానికి హత్తుకునేలా వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు.  జాతీయ అజెండా అంటూ యావద్దేశానికీ మార్గదర్శనం చేయగలిగేలా తెలంగాణ అభివృద్ధిని ప్రముఖంగా ప్రజలలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.   ఇక తన కేబినెట్ లో ప్రజలలో సానుకూలత ఉన్న ఇద్దరు మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను రంగంలోనికి దింపారు. వారిరువురూ కూడా ఇప్పటికే విస్తృత పర్యటనలతో ప్రజలలో మమేకం అవుతున్నారు.  విపక్షాల విమర్శలను దీటుగా తిప్పి కొట్టడమే కాకుండా, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకు వెళుతున్నారు. దీనికి తోడు వారు తమ పర్యటనలలో ఎక్కువగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వర్గాలను కలుస్తూ వారిని సముదాయించో, బుజ్జగించే టీఆర్ఎస్ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.  రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవిధిలో తెలంగాణ అభివృద్ధి దేశానికి తలమానికంగా నిలిచిందనే విషయాన్ని  ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రజలలో ప్రభుత్వ సానుకూలత పెరిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

 

Post Midle

Tags: Hope, breath on both of those

Post Midle