అన్నదాతల్లో ఆశలు

Hopes in elderly (Nellore)

Hopes in elderly (Nellore)

Date:12/06/2019

 

నెల్లూరు ముచ్చట్లు:

జలయజ్ఞంలో చేపట్టిన పనులను పూర్తిచేసి భూములన్నింటికీ సాగునీరందిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం రైతుల్లో సాగునీటి ఆశలను రేకెత్తిస్తోంది. చేజర,్ల కలువాయి మండలాల్లో కండలేరు, సోమశిల జలాశయాల మధ్యనున్న 14 వేల ఎకరాలకు సాగునీరు అందించడం కోసం 2009లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ ప్యాకేజీ నం.12 కింద రూ.28 కోట్ల వ్యయంతో నాటి ప్రభుత్వం ఓ సాగునీటి పథకాన్ని చేపట్టింది. దీనికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో శుంకుస్థాపన చేయించాలని అప్పటి ఆత్మకూరు శాసనసభ్యులు, పురపాలకశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంకల్పించారు. వైఎస్‌ మరణంతో ఆ కార్యక్రమం నిలిచిపోయింది. అనంతరం గుత్తేదారుల జాప్యం, భూసేకరణ అవాంతరాల కారణంగా ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. జాప్యం కారణంగా నిర్మాణ వ్యయం, భూసేకరణ వ్యయం భారీగా పెరిగాయి. ఇది పూర్తవుతుందని ఏ ఏడాదికా ఏడాది ఆశగా ఎదురుచూసే ప్రతిపాదిత ఆయకట్టు రైతులకు నిరాశే మిగులుతోంది. నూతన ప్రభుత్వం నవరత్నాల్లో జలయజ్ఞం పనులు చేర్చడం రైతుల్లో కొత్త ఆశలు నింపుతోంది. ఈ పథకాన్ని మంజూరు చేయించిన ఆనం రామనారాయణరెడ్డి ఈ ప్రాంతంలో శాసనసభ్యునిగా ఎన్నిక కావడంతో పనులు వేగవంతం చేయించాలని రైతులు కోరుతున్నారు.

 

 

 

ఎకరం నేలకు సాగు నీరందించడానికి రాష్ట్రంలో చాల సాగునీటి పథకాలకు రూ.70 వేల నుంచి రూ.1.50 లక్షలు ఖర్చు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఎకరానికి రూ.20 వంతున ఖర్చుచేస్తే సాగునీరందించగలిగే పథకానికి ప్రభుత్వం సకాలంలో కాసులివ్వని కారణంగా రెండు మండలాల్లో 15 గ్రామాలు సాగు, తాగునీరు లేక కరవు కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. ఆయకట్టుకు ఒక పంటకు నీరిస్తేనే ఏటా రూ.30 కోట్లకు పైగా ఆదాయం రైతులకు సమకూరుతోంది. అత్యంత తక్కువ ఖర్చుతో నిర్మితమవుతున్న ఈ సాగునీటి పథకం నిధుల కొరతతో పదేళ్లుగా నత్తనడకన సాగుతోంది. ఏ నీటి ఆదరవు లేని మెట్టపల్లెలు నీటిచుక్క కోసం నిరీక్షించి నీరసించాయి. ఎగువన కండలేరు ఎడమకాలువ, దిగువన సోమశిల దక్షిణ కాలువ ఉన్నా మధ్యన ఉండే గ్రామాలు గుక్కెడు నీరు దొరక్క అలమటిస్తున్నాయి.
మూడు దశాబ్దాల పోరాటంతో ఎట్టకేలకు 2009లో ఓ సాగునీటి పథకాన్ని మంజూరు చేయించుకున్నా, పనులు పూర్తిచేయడంలో గుత్తేదారుల జాప్యం, చేసిన పనులకు బకాయిలు చెల్లించడంలో, కాలువలు, జలాశయాలకు అవసరమైన భూముల సేకరణలో జాప్యం చేసిన కారణంగా రెండేళ్లలో పూర్తికావల్సిన పథకం పదేళ్లు గడిచినా లక్ష్యాన్ని చేరలేదు. ఫలితంగా చేజర్ల, కలువాయి మండలాల్లోని పదిహేను గ్రామాల ప్రజలు నీటి కోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి నష్టపోతున్నారు.

 

ఇంగ్లీష్.. వింగ్లీష్

Tags:Hopes in elderly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *