Natyam ad

నంద్యాల కలెక్టరేట్లో కదం దొక్కిన ఆశా లు …

-అడ్డువచ్చిన పోలీసులు తిరగబడిన ఆశలు ఏఐటియుసి నాయకులు

 

నంద్యాల ముచ్చట్లు:

జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగినది. ఈ ధర్నాలో ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి పి సుంకయ్య  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు .సుంకయ్య గారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు దాటుతూ ఉన్న ఆశ వర్కర్ల సమస్యలు ఇంతవరకు పరిష్కరించలేదు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తానన్నాడు ఇంతవరకు దాని ఊసే లేదు కరోనా తర్వాత ప్రతి ఒక్క ఆశ వర్కర్ కు 16 వేల రూపాయలు జీతం ఇస్తానని చెప్పి ఇంతవరకు మాట మెదపలేదని అలాగే కరోనాలో చనిపోయిన ఆశ వర్కర్లకు 50 లక్షల ఇన్సూరెన్స్ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తానని ఇంతవరకు ఏమీ చేయలేదని సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం 26 వేల రూపాయలు కనీసవేదం ఏర్పాటు చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని పలు డిమాండ్లతో ధర్నా నిర్వహించడం జరిగింది .దాదాపు గంటసేపు ధర్నా నిర్వహించిన అధికారులు రాకపోవడంతో పోలీసులకు ఏఐటియుసి నాయకులకు ఆశ వర్కర్లకు మధ్య తోపులాట జరిగినది .

 

 

 

Post Midle

అయినా కూడా అధికారులు రాకపోతే నాయకులతో పాటు వర్కర్లందరూ దాదాపు గంటసేపు రోడ్డుపై బైఠాయించిన తర్వాత  పోలీసు వారు వచ్చి రోడ్డుపై ధర్నా ఆపాలని అధికారులను పిలిపిస్తామని హామీ ఇచ్చిన తర్వాత డిఆర్ఓ గారికి పిలిపించి ఆశ వర్కర్ల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగినది .దీన్ని డిఎంహెచ్వోకు బదిలీ చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నంద్యాల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డి శివ బాలకృష్ణ జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బాస్ నంద్యాల పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు బనగానపల్లె మండల కార్యదర్శి కుల్లాయి స్వామి ఆశా వర్కర్ యూనియన్ నాయకురాలు వేదవతి ,వెంకటేశ్వరమ్మ ,చిట్టెమ్మ, రామాంజనమ్మ ,సుధా రాణి, చంద్రకళ ,హుస్సేన్ బి ,మేరమ్మ, ఆదిలక్ష్మి ,సుశీలమ్మ తదితర వందల మంది ఆశ వర్కర్లు హాజరు కావడం జరిగినది.

 

Tags: Hopes that have been dashed in Nandyala Collectorate…

Post Midle