కొంప ముంచిన ఓవర్ కాన్ఫిడెన్స్

హైదరాబాద్ ముచ్చట్లు:

సాంప్రదాయాక రాజకీయాలకు చాలా కాలం క్రితమే కాలం చెల్లిపోయింది. పాలిటిక్స్‌ మొత్తం కన్సల్టెంట్ల చెప్పు చేతల్లో నడుస్తున్నాయి.గత దశాబ్ద కాలంలో పొలిటికల్ కన్సల్టెంట్ల ప్రభావం గణనీయంగా పెరిగింది. తెలంగాణలో బిఆర్ఎస్‌ పార్టీ వైఫల్యానికి ఎవరి సలహాలు తీసుకోకపోవడం కూడా ఓ కారణమని ప్రచారం జరుగుతోంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్ కన్సల్టెంట్ల సేవల్ని వినియోగించుకునే విషయంలో బిఆర్‌ఎస్‌ పార్టీ చేసిన చిన్న పొరపాటుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. దాదాపు ఏడాదిన్నర, రెండేళ్ల క్రితమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం గ్రౌండ్‌ ప్రిపేర్ చేసే క్రమంలో ప్రశాంత్‌ కిషోర్ బృందంతో బిఆర్‌ఎస్ అగ్ర నాయకత్వం చర్చలు జరిపింది. కొన్ని నెలల పాటు ఆ సంస్థ తెలంగాణలో అధికార పార్టీకి సేవలు కూడా అందించింది. ఏం జరిగిందో నిర్దిష్టంగా తెలియకపోయినా మూడు నాలుగు నెలలకే బిఆర్‌ఎస్‌తో బంధానికి బ్రేక్ పడింది.ఆ తర్వాత కన్సల్టెంట్లు చెప్పే సలహాలను అమలు చేసే విషయంలో బిఆర్‌ఎస్‌ నాయకులు బహిరంగంగా ఎద్దేవా కూడా చేశారు.

 

పొలిటికల్ కన్సల్టెంట్స్‌ ఆచరణ సాధ్యం కాని సలహాలు ఇస్తుంటారని, వాటిని పాటించలేమంటూ బిఆర్‌ఎస్ నాయకులు పబ్లిక్‌గా జోకులు సైతం వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రశాంత్ కిషోర్ బృందం కేసీఆర్‌ ప్రభుత్వానికి ఏమి సలహా ఇచ్చిందనే విషయంలో ప్రచారం జరుగుతోంది.తెలంగాణలో బిఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా అమలు చేసిన ప్రతిష్టాత్మక పథకాల్లో డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్ల స్కీం ఉంది. ఈ పథకం అమలుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దానిని మార్చాలని పికె టీమ్‌ సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు.డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్ల బదులు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే వ్యయాన్ని నేరుగా లబ్దిదారుడికి అందించేలా మార్చాలని సూచించినట్టు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ గ్రాంటుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సాయాన్ని కలిపి నేరుగా కలిపి లబ్దిదారుడికి ఇస్తే ఎక్కువ ప్రయోజనంతో పాటు సానుకూల ఫలితాలు ఉంటాయని సూచించినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో పలు సంస్కరణలను ఐ పాక్‌ ప్రతిపాదించడం వాటికి కేసీఆర్ సర్కారు నిరాకరించినట్టు చెబుతున్నారు. దీంతో పాటు తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం, సిట్టింగ్ ఎమ్మెల్యేలో 45-50మందిని మార్చడం వంటి సిఫార్సులు చేసినట్టు తెలుస్తోంది.ఆర్ధిక ఇబ్బందులు, ఇతర కారణాలతో విధాన పరమైన నిర్ణయాల్లో మార్పులు చేయడానికి కేసీఆర్ నిరాకరించడంతో కన్సల్టెన్సీ బాధ్యతల నుంచి ఐపాక్ తప్పుకున్నట్టు చెబుతున్నారు. ఆ తర్వాత మరో సంస్థను డిజిటల్ కాంపెయినింగ్‌ కోసం బిఆర్‌ఎస్ ప్రభుత్వం నియమించుకున్నా ఆశించిన ఫలితాలు రాలేదని చెబుతున్నారు.అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున సునీల్ కనుగోలు పనిచేశారు. మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోయినా తెలంగాణలో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడంలో కన్సల్టెంట్లు కీలక పాత్ర పోషించారు. ఓ దశలో కాంగ్రెస్ పార్టీ వార్‌రూమ్‌పై పోలీసులు దాడి చేయడంతో దానిని బెంగుళూరుకు మార్చి కార్యకలాపాలు నడిపించారు.

Tags:  Horned overconfidence

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *