Horrible time is running out

భయానక సమయం జరభద్రం 

-ఇది చాలా విషమ పరిస్థితి. ముఖ్యంగా నగరాల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

Date:12/07/2020

అమరావతి ముచ్చట్లు:

మనం టీవీలో టెస్టులు చేసుకున్న వారి సంఖ్య మాత్రమే వింటున్నాం. టెస్టులు చేయించుకోకుండా వైరస్ సోకి ఉన్న వారు లక్షల్లో మనమధ్యే ఉన్నారు.దయచేసి ఎవరి ఇంటికి వెళ్ళకండి. తెలిసిన వారే కదా అని వెళ్లి, వారిని ఇబ్బంది పెట్టకండి. చెప్పకుండా చొరవగా వెళ్లి, వాళ్ల ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చోకండి. ఏ వస్తువులు పడితే వాటిని ముట్టుకోకండి.ఒకవేళ బంధుమిత్రులతో మాట్లాడాలనుకుంటే, ఫోన్ కాల్ చేసి మాట్లాడండి. చూడాలనిపిస్తే వీడియో కాల్ చేసి మాట్లాడండి. ప్రత్యక్షంగా కలవాలి అనుకుంటే ముందే ఫోన్ చేసి, ఇంటి ముందుకు వెళ్లి, బయటకు పిలిచి, మాస్కు ధరించి భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకొని కాసేపు మాట్లాడి వెళ్ళండి.అంతేకానీ చొరవతో తగుదునమ్మా అంటూ నేరుగా కిచెన్ లోకి, బెడ్ రూమ్ లోకి వెళ్లి, ఏమిటి కబుర్లు అంటూ సొల్లు విషయాలు మాట్లాడకండి.వారు మొహమాటంతో, అప్పుడు మిమ్మల్ని ఏమీ అనకపోయినా.మీరు వెళ్లి పోయిన తర్వాత మిమ్మల్ని తిట్టుకోవడం ఖాయం.వారు మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని పిలిచినా.. మీరు గౌరవంగా.. పర్వాలేదు మరో సారి వస్తానని చెప్పి వెళ్ళండి.అప్పుడే మీరు మర్యాద తెలిసిన వ్యక్తులుగా పరిగణించబడతారు.మీరు వారికి ఎంత ప్రాణ స్నేహితులైనా కావచ్చు. లేక ఎంత దగ్గరి బంధువులైనా కావచ్చు. వారిని ఎట్టి పరిస్థితుల్లో కలవండి.ఇక ఇరుగుపొరుగువారు ఇచ్చే వంటకాలను ససేమిరా తీసుకోకండి. అలాగే వారికి మీ వంటకాలను ఇతర తినుబండారాలను ఏమీ ఇవ్వకండి. ఈ ఇచ్చి పుచ్చుకోవడాలు కొంతకాలం ఆపేయండి. ఈ విషయమై వారితో ఒకసారి సౌమ్యంగా చెప్పండి.స్నేహితులతో కలిసి మందు పార్టీలు కొన్ని రోజులు ఆపేయండి. ఈ మద్యం పార్టీల వలన చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.అవసరం లేకపోయినా రోడ్డుమీదకు వెళ్ళకండి. వాకింగ్ కూడా మానేయండి. ఇంట్లో యోగ మెడిటేషన్, వెయిట్ లిఫ్టింగ్ వంటివి చేయండి.నువ్వు నీ శ్రేయోభిలాషులకు ఇచ్చే గౌరవం వారిని కలవకపోవడమే.

ఏపీ కర్ణాటక అంతర్రాష్ట్ర సర్వీసులకు బ్రేక్ 

Tags:Horrible time is running out

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *