Horsley Hills

హడలుతున్న హార్సిలీ హిల్స్

#అధికమైన చిరుతల సంచారం
#ఆందోళనలో స్థానికులు

Date:10/05/2020

బి.కొత్తకోట ముచ్చట్లు:

బి.కొత్తకోట మండలం లోని పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ లో స్థానికులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. దీనికి కారణం కరోనా వైరస్ కారణంగా అమలులో ఉన్న లాగ్ డౌన్. మార్చి 22వ తేదీ నుంచి హార్సిలీ హిల్స్ కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీని ఫలితంగా జనసంచారం లేకపోవడంతో అడవుల్లోని వన్యప్రాణులు కొండ పైకి వచ్చి స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఇందులో భాగంగానే చిరుతలు కూడా రోడ్లపై కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో కొండపై రెండు చిరుతలు సంచారం చేస్తున్నాయి. వీటికి అవసరమైన ఆహారం కోసం కొండపైకి వస్తున్నట్లు తెలుస్తోంది. కొండపై కుక్కల సంచారం ఎక్కువగా ఉండేది. కొన్ని రోజులుగా కుక్కల జాడలేదు. తొలుతగా రైల్వే గెస్ట్ హౌస్ వద్ద కాపలా ఉన్న వాచ్మెన్ కి చెందిన కుక్కపై చిరుత దాడి చేసి తీసుకెళ్ళింది. ఆ తర్వాత కొండపై సంచరిస్తున్న కుక్కలు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. దీనికి కారణం చిరుతలే అని స్థానికులు స్పష్టంగా చెబుతున్నారు. రాత్రి ఎనిమిది గంటలు దాటితే చిరుత లో కనిపిస్తున్నాయని చెబుతున్నారు. హాలిడే హోమ్స్, ఏనుగు మల్లమ్మ గుడి, రైల్వే గెస్ట్ హౌస్, పైనున్న గాలి బండలు, అటవీ శాఖకు చెందిన పర్యావరణ సముదాయం చిరుతల సంచరిస్తున్నట్లు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇవి ఆహారం కోసం స్థానికులపై దాడి చేసే ప్రమాదం ఉందని భయపడుతున్నారు‌. అటవీశాఖ అధికారులు ఈ విషయంలో తక్షణమే చర్యలు చేపట్టకుండా చిరుతలు మనుషులపై దాడి చేసే ప్రమాదం లేకపోలేదు. ప్రమాదం జరిగాక స్పందిస్తే అప్పటికే జరగరాని నష్టం జరిగిపోతుంది. ఈ విషయంలో అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందించి సత్వరమే చర్యలు తీసుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారు.

తెలంగాణముంబై నుంచి వచ్చిన కూలీలకు కరోనా.. అక్కడ కలకలం 

Tags: Horsley Hills

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *