అమ్మవారి సేవలో హొసూర్ ఎమ్మెల్యే ప్రకాష్
– అభివృద్దికి చేసిన పెద్దిరెడ్డికు అభినందనలు
– చైర్మన్‌కు ఘనంగా సన్మానం
చౌడేపల్లె ముచ్చట్లు:

కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ •దైవంగా ప్రసిద్దికెక్కిన బోయకొండ గంగమ్మను కర్ణాటక రాష్ట్రం హొసూరు ఎమ్మెల్యే వై. ప్రకాష్,హొసూర్ మేయర్ ఎస్‌ఏ. సత్య,మాజీ ఎమ్మెల్యే మురగన్ తదితరులు శుక్రవారం దర్శించుకొన్నారు.వీరిని ఆలయ కమిటి చైర్మన్ మిద్దింటి శంకర్‌నారాయణ ఆలయ మర్యాధలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తమ కోర్కెలు పలించినందున అమ్మవారికి వెహోక్కలు చెల్లించడానికి వచ్చామన్నారు. ఆలయం వద్ద భక్తులకు సౌకర్యం, రవాణా , ఆలయ అభివృద్ది ను చూసి మంత్రి పెద్దిరెడ్డి కుటుంభాన్ని అభినందించారు. చారిత్మ్రాకంగా అభివృద్దిచేసి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అనంతరం చైర్మన్ శంకర్‌నారాయణను సత్కరించారు. ఎమ్మెల్యే, సహచరులకు అమ్మవారి పవిత్ర తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డియంక్ యూనిన్ కార్యదర్శి నగేష్,జిల్లా కౌన్సిల్ యూనియన్ కార్యదర్శి భాగ్యరాజ్, యూనియన్ చైర్మన్ శ్రీనివాస రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆనందయ్య, జిల్లా మాజీ •వైస్ చైర్మన్ వీరారె డ్డి, నేతలు గోపి,శ్రీనివాసులు,హరీష్,హేమాద్రినాయుడు, తదితరులున్నారు.
Tags: Hosur MLA Prakash in Ammavari Seva
