అంతరిక్షంలో వ్యోమగాములకు హోటల్

Hotel for astronauts in space

Hotel for astronauts in space

Date:10/12/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

హబ్బ.. అంతరిక్షంలో హోటలా? ఇంచక్క, స్పేస్ షిప్‌లో వెళ్లిపోయి.. ఒక వైపు భూగ్రహాన్ని, మరో వైపు చంద్రుడిని చూస్తూ ఇడ్లీ, సాంబర్ లాంగించేస్తే ఎంత బాగుంటుందో అని కలలు కంటున్నారా? ఒక్క క్షణం ఆగండి. ఆ హోటల్ మీ కోసం కాదు. అంతరిక్షంలో ఉండే వ్యోమగాములకు కూడా కాదు. అక్కడ ఏర్పాటు చేసే రోబోట్‌లకు మాత్రమే. రోబోట్‌లకు హోటల్ ఏమిటండి బాబు.. మరీ చిత్రంగా అనుకుంటున్నారా? అయితే, ఈ విషయం తెలుసుకోవల్సిందే.
ఇప్పటికే అంతరిక్షంలో సేవలందిస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో రోబోటిక్ టూల్ స్టావేజ్  ద్వారా ఈ ‘రోబోట్ హోటల్’ను అందుబాటులోకి తేవాలని నాసా నిర్ణయించింది. తొలి విడతలో రెండు రోబెటిక్ ఎక్స్‌ట్రనల్ లీక్ లొకేటర్స్ లను ఏర్పాటు చేస్తారు. ఇవి అంతరిక్ష కేంద్రంలో లీకేజీలను అరికట్టేందుకు పనిచేస్తాయి. ఈ హైటెక్ రోబోట్లకు ఆమోనియాను పీల్చగలిగే మాస్ స్పెక్ట్రోమీటర్స్‌ ఉంటాయి. రెల్ ను తొలిసారిగా 2015లో అంతరిక్షంలోకి పంపారు. దీనికి బ్యాకప్ కింద రెండో ను ఈ ఏడాది ఆరంభంలో పంపారు. తాజాగా మరో రెండు అత్యాధునిక అంతరిక్ష కేంద్రానికి ప్రయాణమయ్యాయి. రోబోట్ హోటల్‌లు ఉండే ఈ రెండు  ద్వారా రోబోట్లకు అవసరమైన వెచ్చదనం లభిస్తుంది. అలాగే, రేడియేషన్, మైక్రోమీటవురాయిడ్స్ లేదా సూక్ష్మ లేదా వేగంగా దూసుకొచ్చే వస్తువుల నుంచి కూడా భౌతిక రక్షణ కల్పిస్తాయి. రోబోట్‌లకు అవసరమైన ఉష్ణోగ్రతను అందిస్తుంటాయి. ఎందుకంటే, రోబోట్‌లు ఆహారం తీసుకోవు. అంతరిక్షంలో సరైన ఉష్ణోగ్రతలు ఉంటేనే అవి పనిచేయగలవు. అదే వాటికి తగిన ఆహారం. అందుకే.. NASA దీన్ని ‘రోబోట్ హోటల్’ అని పిలుస్తోంది.

 

చేతి చర్మంతో నాలుక

 

Tags:Hotel for astronauts in space

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *