రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్టులు

Date:09/11/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

ఆర్టీసీ చలో ట్యాంకుబండ్ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎక్కడి నేతలను అక్కడే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, మాజీ మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి గీతారెడ్డిలను హైద్రాబాద్లో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను హన్మకొండలో గృహ నిర్బంధం చేశారు. అశ్వత్థామరెడ్డి, థామస్ రెడ్డి, జేఏసీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తెలంగాణలో పలు జిల్లాల్లో కుడా అరెస్టుల పరంపర కొనసాగింది. శనివారం ఆర్టీసీ జేఏసీ ట్యాంక్ బండ్పై సకల జనుల సామూహిక దీక్ష తలపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి పోలీసులు నో చెప్పారు. కానీ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా..నిరసన దీక్ష చేపట్టి తీరుతామని ఖరాఖండిగా చెబుతున్నారు. ఎన్ని నిర్బంధాలెదురైనా చలో ట్యాంక్ బండ్ జరిపి తీరతామన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. కార్మికులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

 

రాయచూరు రైల్వే లైను అంశం పై ఆశలు

 

Tags:House arrests of congressional leaders throughout the state

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *