పుంగనూరులో గృహనిర్మాణాలు ఉగాధిలోపు పూర్తి చేయాలి-చైర్మన్ అలీమ్బాషా
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాలను ఉగాధిపండుగలోపు పూర్తి చేయాలని మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా , అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పట్టణంలోని పలు సచివాలయాలను తనిఖీ చేసి అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్రెడ్డి ఆదేశాల మేరకు జగనన్న కాలనీలు ఉగాధి పండుగకు పూర్తి చేసే బాధ్యతను ఆయా కౌన్సిలర్లు, అధికారులు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆశయం మేరకు పండుగ రోజున పక్కా గృహాలలో పండుగ నిర్వహించుకునేలా పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే కాలనీలలో విద్యుత్, నీటి పైపులైన్లతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిర్మాణాలలో ఎలాంటి సమస్యలు ఎదురైనా ప్రజలు ఫిర్యాదు చేయాలన్నారు. తక్షణమే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు లక్ష్మణ్రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags; House constructions in Punganur should be completed within Ugadhi-Chairman Aleem Basha
