Natyam ad

చికిత్స పొందుతూ గృహసారథి మృతి

సోమల ముచ్చట్లు:

 


సోమల మండలం‌‌ పొదలగుంటపల్లె పంచాయతీ సీ.వడ్డిపల్లెకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త సుబ్రహ్మణ్యం ప్రమాదవశాత్తు రేఖలు మీద పడి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.కుటుంబ సభ్యులు వివరాల మేరకు వారం క్రితం రాత్రి అతని ఇంటి ముందు ఉన్న రాములవారిగుడి వరండాలో వెడికి తట్టుకోలేక రాత్ర నిద్రిస్తుండగా 12 గంటల‌ ప్రాంతంలో గుడి బయట వరండాలో ఉన్న రేఖులు అతని పై పడి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తులు,కుటుంబ సభ్యులు హుటాహుటిన తిరుపతి రుయా అసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొమదుతూ మంగళవారం మృతి చెందాడు.ఇతడు వైఎస్సార్ సీపీ కార్యకర్తగా గృహసారథిగా పార్టీ కోసం సేవలు అందిస్తున్నాడు.ఇతన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.మృతదేహాన్ని పార్టీ మండల ఉపాధ్యక్షుడు నాగభూషణం రెడ్డి,సర్పంచ్ జయరాం సందర్శించి నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి జరిగిన సంఘటన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిల దృష్టికి తీసుకెళ్లి అదుకుంటామని భోరోసా ఇచ్చారు.కార్యక్రమం మాజీ సర్పంచ్ గుంజి లక్ష్మమ్మ,వాటర్ షెడ్ చైర్మన్ సరసమ్మ,సచివాలయ కన్వీనర్ సిద్దయ్య పాల్గొన్నారు.

 

Tags: Householder died while receiving treatment

Post Midle
Post Midle