Natyam ad

సచివాలయ పరిధిలో పనులు వేగవంతం చేయాలి

పుంగనూరు ముచ్చట్లు:

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సచివాలయాల ద్వారా కేటాయించిన నిధులతో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి సూచించారు. ఆయన, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, ఎంపీడీవో రామనాథరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌తో కలసి ఎంసి.పల్లె సచివాలయాన్ని తనిఖీ చేశారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ సచివాలయ కార్యదర్శులు, వలంటీర్లు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలపై నివేదికలు సిద్దం చేస్తూ ఉండాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో సచివాలయాల వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోందని కొనియాడారు. ముఖ్యంగా ప్రజల డేటాలను సచివాలయ పరిధిలో ఏర్పాటు చేసి , వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేలా సచివాలయు ఉద్యోగులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వలంటీర్లు పాల్గొన్నారు.

Post Midle

Tags: Houses should be built in Punganur…

Post Midle

Leave A Reply

Your email address will not be published.