Natyam ad

ఇళ్ల పట్టాలిచ్చారు.. నిర్మాణం మరిచారు

జనసేన ముచ్చట్లు:

అల్లూరి సీతారామరాజు అరకులోయ మండలంలోని మాదల పంచాయతీ పరిధిలో గల ముసిరిగూడ గ్రామంలో శనివారము  జనసేన పార్టీ మాజీ ఎంపిటిసి సాయిబాబా  దురియా. మాదల శ్రీరాములు. అల్లంగి రామకృష్ణ. మత్స్యరాజు తదితరుల ఆధ్వర్యంలో ఆయా గ్రామంలో పర్యటించి ముందుగాను  గ్రామస్తులతో సమవేశమై గ్రామంలో నెలకొన్న సమస్యల మీద చర్చించారు.  జనసేన మాటలు జనసేన సిద్ధాంతాలు గిరిజనుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆ యొక్క గ్రామంలో వైయస్సార్ ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్ల ఇచ్చి నేటి వరకు ఇల్లు నిర్మించకుండా  ఈ ప్రభుత్వం చేతులు దులుపుకుందని తెలిపారు. దీనిపై స్పందించిన జనసేన పార్టీ మాజీ ఎంపీటీసీ  సాయిబాబా దురియా. మాదల శ్రీరాములు. రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే గిరిజనులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ఇళ్ల పట్టలిచ్చి జగన్ రెడ్డి నాయకత్వంలో ఇల్లు నిర్మించి ఇవ్వకుండా చేతులు దులిపేసుకున్నారని ప్రభుత్వంపై ద్వజమెత్తారు ఇప్పటికైనా ప్రభుత్వం గిరిజనుల పట్ల చిత్తశుద్ధితో సమస్యల పట్ల దృష్టి చారించి
సమస్యలను వేగవంతంగా పరిష్కరించేలా కృషి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని. జగన్ రెడ్డి ప్రభుత్వానికి  గద్దె దించడానికి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కదలిరావాలని, . ఈ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలనితెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు గ్రామస్తులు. జనసైనికులు  తదితరులు  పాల్గొన్నారు.

 

Tags: Houses were given away.. Construction was forgotten

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.