ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన ఇల్లాలు

ఏలూరు ముచ్చట్లు:

– నిద్రమాత్రలు ఇచ్చి ఉరేసుకున్నట్లు చిత్రీకరణసమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకూ కనుమరుగవుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో పడి నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతున్నారు.ఈ ఘటనల్లో ఏ సంబంధం లేని పలువురు తనువు చాలిస్తున్నారు.తాజాగా ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.అంతేగాక భర్త ఉరివేసుకొని మృతిచెందాడని కుటుంబసభ్యులను నమ్మించింది.చివరకి పోలీసులు రంగప్రవేశంతో అసలు దొంగలు బయటపడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,వేములపల్లి గ్రామంలో ఆశీర్వాదం, సుమలత భార్యభర్తలుగా జీవనం సాగిస్తున్నారు. అయితే సుమలత, నాగారాజు అనే వ్యక్తితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. వీరి బంధానికి భర్త ఆశ్వీర్వాదం అడ్డుగా ఉన్నాడని సుమలత భావించింది. ఎలాగైన ఆశీర్వాదాన్ని హతమార్చాలని ఇరువురూ నిశ్చయించుకున్నారు.భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చి పీక నులిమి చంపిన భార్య : పథకం ప్రకారం ఈ నెల ఒకటో తేదీ అర్ధరాత్రి సుమలత, ఆమె ప్రియుడుతో కలిసి భర్త ఆశీర్వాదానికి నిద్ర మాత్రలు ఇచ్చి పీక నులిమి హతమార్చారు. అనంతరం భర్త ఆశ్వీర్వాదం ఉరివేసుకొని మృతిచెందాడని సుమలత కుటుంబసభ్యులను నమ్మించింది. ఇది నిజమే అని నమ్మి కుటుంబసభ్యులు నాగరాజుకు దహన సంస్కారాలు కూడా పూర్తి చేశారు.

 

అయితే దహన సంస్కారాలకు ముందు నాగరాజుకు స్నానం చేయిస్తుండగా శరీరంపై గాయాలు కనిపించాయి. వాటిని చూసిన మృతుని తల్లిదండ్రులు అనుమానంతో కోడలు సుమలతను నిలదీశారు. ఇప్పటికే భర్త పోయిన దుఃఖంలో ఉన్నాను అంటూ అత్తమామలు, కుటుంబసభ్యులతో చెప్పి దొంగ ఏడుపుతో బోరున విలపించింది. ఇక చేసేదేమీలేక కుటుంబసభ్యులు మృతుడిని ఖననం చేశారు.మృతదేహన్ని వెలికి తీసి పోస్టుమార్టం :ఆశీర్వాదం మృతిని తట్టుకోలేని తల్లిదండ్రులు, బంధువులు కోడలు సుమలత మీద అనుమానంతో మరోసారి గట్టిగా నిలదీశారు. చివరికి ప్రియుడు నాగారాజుతో కలిసి భర్త ఆశీర్వాదాన్ని హత్య చేసినట్లు సుమలత ఒప్పుకుంది. దీంతో మృతుడి బంధువులు ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్​లో ఈ నెల మూడో తేదీన ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు మృతుడు ఆశీర్వాదం మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం నిందితురాలు సుమలతని అదుపులోకి తీసుకొని ఆమె ప్రియుడు నాగారాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

Tags:Houses where the husband was married with the boyfriend

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *