పుంగనూరులో గృహనిర్మాణాలు వేగవంతం చేయాలి
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలో గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి సూచించారు. గురువారం కార్యాలయంలో ఎంపీడీవో రాజేశ్వరితో కలసి హౌసింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మండలంలో 12 కాలనీలు ఏర్పాటు చేసి అందులో 3,386 మందికి గృహాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 60శాతం పనులు జరిగిందన్నారు. అధికారులు , సచివాలయ ఉద్యోగులు , ప్రజాప్రతినిధులు తక్షణమే తమ పరిధిలోని గృహనిర్మాణాలు పూర్తి చేయించాలని సూచించారు. అలాగే చేసిన పనులకు బిల్లులు చెల్లించాలన్నారు. అలాగే కాలనీల నిర్మాణాలకు ఇసుక, సిమెంటు పంపిణీ చేస్తున్నామన్నారు. కాలనీలకు విద్యుత్ద్దీకరణతో పాటు పైపులైన్లు వేసి నీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఈఈ మధుబాబు, హౌసింగ్ ఏఈ రెడ్డిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Housing construction in Punganur should be accelerated
