జులై 3,4 తేదీల్లో హౌసింగ్ గ్రౌండ్ మేళా

గూడూరులో  3870 మంది వరకు లబ్ధిదారులు
ప్రతి 50 ఇళ్ళ కు ఒక సెక్రటరీ నియామకం
సబ్ కలెక్టర్ బాపిరెడ్డి వెల్లడి
గూడూరు  ముచ్చట్లు :
జులై నెల 3,4 తేదీల్లో జరిగే హౌసింగ్ గ్రౌండ్ మేళాని గూడూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని గూడూరు సబ్ కలెక్టర్ బాపిరెడ్డి పిలుపునిచ్చారు.గూడూరు పట్టణంలో మండల పరిషత్ కార్యాలయంలో ఉన్న గూడూరు వెలుగు కార్యాలయంలో గూడూరు తహశీల్దార్,ఎంపీడీవో,గృహ నిర్మాణ శాఖ అధికారులు,గ్రామ రెవెన్యూ అధికారులు తో  సమీక్ష సమావేశం గూడూరు సబ్ కలెక్టర్ బాపిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గూడూరులో సుమారు 3870 మంది  లబ్ధిదారులు వున్నారు అని, లబ్ధిదారుల అందరూ హౌసింగ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.జులై 3,4 తేదీల్లో ఇళ్ళు నిర్మాణం మొదలు పెట్టాలి అని,ప్రతి 50 ఇళ్ళ కు ఒక సెక్రటరీ ని నియమించి, ఇంటి నిర్మాణంకు అవసరమైన ఇసుక,స్టీల్,సిమెంట్ తదితర మెటీరియల్ సరఫరా పక్రియ వారు పర్యవేక్షిస్తారని ఆయన వెల్లడించారు.ప్రభుత్వం నుండి వచ్చే సౌకర్యాలను లబ్ధిదారులు అందరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో గూడూరు కమిషనర్ రఘుకుమార్,గూడూరు తహశీల్దార్ బాలలీలారాణి, ఎంపీడీవో నాగమణి,గృహ నిర్మాణ శాఖ అధికారులు, వి ఆర్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Housing Ground Mela on July 3,4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *