చౌడేపల్లెలో పండుగను తలపించేలా హౌసింగ్‌ గ్రౌండిగ్‌ మేళా

చౌడేపల్లె ముచ్చట్లు:

 

పండుగను తలపించేలా గ్రామస్థాయినుంచి మండల స్థాయి వరకు హౌసింగ్‌ గ్రౌండిగ్‌ మేళాను విజయవంతం చేయాలనిఎంపీడీఓ శంకరయ్య సూచించారు. ఆదివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్‌, హౌసింగ్‌ శాఖ సిబ్బందితో సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతోమండలానికి 2139 పక్కా గృహాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. జూలై 1 వతేదీన ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రౌండింగ్‌ మేళాను ప్రారంభిస్తారన్నారు.జియోట్యాగింగ్‌, మ్యాపింగ్‌ చేసిన 1001 గృహాలను అదే రోజు ప్రతి గ్రామంలోని లబ్దిదారులచే ఆయా గ్రామాల్లోని ప్రజాప్రతిన్యిధుల సహకారంతో అధికారులు మేళాను విజయవంతం చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో ప్రత్యేక అధికారులను నీయమించామని,వలంటీర్ల సహకారంతో వారికి కేటాయించిన గృహాల్లో గల లబ్దిదారులకు చైతన్యం కల్పించి పనులు వెహోదలైయ్యేలా చూడాలన్నారు. పనులు పూర్తిచేస్తున్న లబ్దిదారులకు వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచ నలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఈలు నరసింహాచారి, డిఈఈ ప్రసాద్‌,తహసీల్దార్‌ మాధవి, తదితరులున్నారు.

 

28 న సర్పంచులు, ఎంపీటీసీలతో సమావేశం….

 

 

స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం సర్పంచులు, ఎంపీటీసీలకు హౌసింగ్‌ గ్రౌండిగ్‌ మేళా పై సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ శంకరయ్య తెలిపారు. ఈ సమావేశానికి అందరూ విధిగా హాజరు కావాలని కోరారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Housing Grounding Mela to mark the festival in Choudepalle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *