హౌసింగ్ గ్రౌండ్ అయ్యేది ఎప్పుడూ

నెల్లూరు ముచ్చట్లు :

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన లబ్ధిదారులు వారి గృహ నిర్మాణాలకు శంకుస్థాపనలు వేగవంతమయ్యేందుకు జులై 1, 3, 4 తేదీల్లో ‘హౌసింగ్‌ గ్రౌండింగ్‌ మేళా’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులకు ఆదేశాలిచ్చింది.గ్రౌండింగ్‌ ప్రక్రియ జులై 9లోగా ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని ఇటీవల సిఎం వైఎస్‌ జగన్‌ గృహ నిర్మాణశాఖ సమీక్షలో పేర్కొన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. శంకుస్థాపనలు పూర్తి చేసి లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ఇంకా 12 రోజులే మిగిలి ఉండటంతో అధికారులు పనిలో నిమగమయ్యారు. మొదటి విడతకు సంబంధించి 15.60 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కోర్టుల్లో కేసుల నేపథ్యంలో 14.50,425 లక్షల ఇళ్లు, జిల్లాల వారీ టార్గెట్లు ఫిక్స్‌ చేశారు. ఇందులో సొంత స్థలాలకు పొజీషన్‌ సర్టిఫికెట్లు తీసుకున్నవారు 96,136 లబ్ధిదారులుండగా, ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో గ్రౌండింగ్‌ అయిన ఇళ్ల సంఖ్య 2,76,649 ఉన్నట్లు సమాచారం. మిగిలిన 12 లక్షలకు పైగా ఇళ్లకు జులై 9లోగా శంకుస్థాపనలు జరుగుతాయా? అనే ప్రశ్న ఉద్భవిస్తోంది. ఇళ్ల నిర్మాణ శంకుస్థాపనలు స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో ముందుకు వెళ్లాలని ఆదేశాలుండటంతో అధికారులు లే అవుట్ల ప్రాంతాలను సందర్శించే పనిలో పడ్డారు. ప్రభుత్వం నూరు శాతం లక్ష్యాలను అధిగమించాలని భావిస్తున్నప్పటికీ ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాల్లో గృహాలు నిర్మించుకునేం దుకు ఆశించిన మేర లబ్ధిదారులు ముందుకు రావడం లేదని నిఘా వర్గాలు ప్రభుత్వానికి సమాచారాన్ని అందించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణాలకు ముందుకు రాని లబ్ధిదారులను ప్రోత్సహించేందుకు ఆయా జిల్లాల్లోని పరిస్థితులను బట్టి గృహ నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న రూ.1.80 లక్షల యూనిట్‌ వ్యయానికి తోడు డ్వాక్రా (ఎస్‌హెచ్‌జి) లింకేజీ ద్వారా రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు అడ్వాన్స్‌ రుణాలు లబ్ధిదారులకు అందేలా సంబంధిత అధికారులు బ్యాంకులతో టయప్‌ చేయాలని ప్రభుత్వం తాజాగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఇళ్లకు కేటాయించిన స్థలాలు ఎక్కడో విసిరేసినట్లుగా ఉండటంతో ఆ ప్రాంతానికి చేరుకునేందుకు ప్రత్యేక బస్సుల ద్వారా లబ్ధిదారులకు రవాణా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం జిల్లాల అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నూరు శాతం గ్రౌండింగ్‌ చేయాలని భావిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కానరావడం లేదని మండల స్థాయిలోని అధికార యంత్రాంగం పేర్కొంటోంది.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Housing never becomes ground

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *