గృహ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభం కావాలి…

Housing works should begin soon

Housing works should begin soon

Date:13/10/2018

పలమనేరు ముచ్చట్లు:

పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పనులను వెంటనే చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖా మంత్రి అమరనాథ రెడ్డి సూచించారు. పట్టణంలోని తన కార్యాలయంలో ఏపి టిడ్కో,మున్సిపల్,రెవెన్యూ శాఖాధికారులతో గృహ నిర్మాణ పథకంపై సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టనున్న జీప్లస్ -3 మొదటి విడతకు సంబంధించిన పనులను సోమవారం నుంచి ప్రారంభించాలని, అదే విధంగా రెండో విడతలో నిర్మించాల్సిన గృహాలకు సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను సోమవారం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందుకు విధానపరమైన ఇబ్బందులేమైనా ఉన్నాయనని అడిగి తెలుసుకున్నారు. ఇక పనులలో జాప్యం జరిగితే సహించేది లేదని పార్టీలు,కులమతాలకు అతీతంగా అర్హులైన అందరికీ న్యాయం జరిగేలా లబ్ధిదారుల ఎంపిక జరగాలని సూచించారు. ఈ సమీక్షలో ఏపి టిడ్కో ఈఈ భాస్కర్ రావ్,ఎన్ సి సి ప్రాజెక్ట్ మేనేజర్ రవి,తహశీల్దార్ రవిచంద్రన్,మున్సిపల్ కమిషనర్ విజయసింహా రెడ్డి,డిఈ విజయకుమార్ రెడ్డి,ఆర్ఐ రమేష్, ఏఈ పుష్పగిరి నాయక్,టిఎంసి షణ్ముగం, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ఆకట్టుకున్న గ్రూపు సభ్యురాలి ప్రసంగం

Tags:Housing works should begin soon

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *