Natyam ad

మత్తు ఇంజక్షన్లు బయిటకు ఎలా ఇస్తున్నారు

-నిద్రపోతున్న నిఘా విభాగం

ఖమ్మం ముచ్చట్లు:

Post Midle

వివాహేతర సంబంధాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. పచ్చని కాపురాల్లో చిచ్చురేపుతున్నాయి. ఈ సంబంధాలతో ఎవరి ప్రాణాలైనా తీసేందుకు వెనుకాడట్లేదు. కొందరు భర్తల ప్రాణాలు తీస్తుంటే, మరికొందరు అమాయక పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఇలాంటి ఘటనే జరిగింది. కట్టుకున్న భర్తను ఆమె ప్రియుడుతో కలిసి అంతమెందించాలని ప్లాన్ వేసింది. పథకం ప్రకారం ఇంజక్షన్‌ వెనక గుచ్చి హత్య చేశారు. సాధారణంగా ఇతర మందుల మాదిరి ఇవి మెడికల్ షాపులలో దొరకవు. వీటిని కేవలం క్వాలిఫైడ్ డాక్టర్ మాత్రమే కొనుగోలు చేయాలి. మూడు నెలల క్రితమే ఇంజక్షన్ తెచ్చి పెట్టుకున్నా కనీసం ఒకరి వద్ద నుంచి సమాచారం బయటకు పొక్కకుండా మేనేజ్ చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిజంగా ఒక ఆర్‌ఎంపీకి ఈ ఇంజక్షన్ చేసే ధైర్యం ఉంటుందా? అసలు ఈ ఇంజక్షన్ దిశగా ఆర్‌ఎంపీ ఆలోచన ఉంటుందా? ఈ మొత్తం వ్యవహారంలో ఆర్‌ఎంపీ పాత్ర ఎంత? ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ పాత్ర ఎంత? అన్న దానిపై పూర్తి ఎంక్వైరీ చేయాల్సి ఉంది. ఎవరి వద్ద ఈ ఇంజక్షన్ కొనుగోలు చేశాడు? ఎన్ని కొన్నాడు. ఆర్‌ఎంపీ, అతడి వద్ద ఇంకేమైనా ఇంజెక్షన్లు మిగిలి ఉన్నాయా అని లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది. ప్రాణహాని ఉన్న మందులను కాసులకు కక్కుర్తిపడి పల్లీ, బఠానీల్లా అమ్మితే దాని పర్యవసానం ఈవిధంగానే ఉంటుందని చెప్పడానికి ఈఘటనే నిదర్శనంఈ ఘటన రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. లేటు వయస్సులో ఘాటు ప్రేమ అన్నట్లు 46సంవత్సరాల వయస్సులో 40సంవత్సరాల వయసు గల తన ప్రియుడితో కలసి భర్తను హత్య చేసి పచ్చని సంసారాన్ని బూడిదపాలు చేసుకోవడంతో పాటు మరో నలుగురి కుటుంబాలలో మంటను రాజేశారు.

 

 

 

మూడు ముళ్లబంధాన్ని ముళ్లబంధంగా, ఏడడుగుల అనుబంధాన్ని అభాసుపాలు చేసి, భర్తకు మరణ శాసనం రాసింది. భర్త చావు వార్త విన్న తర్వాత లోపల ఆనందంతో పైకి బాధ నటించిన ఈకాలం మహానటి.నియోవెక్ ఇంజక్షన్ ఇది కేవలం మేజర్ ఆపరేషన్‌ల సమయంలో పేషంట్‌కు ఇచ్చే మత్తు మందు. ఇది కేవలం అనస్తిషియా డాక్టర్ (మత్తుడాక్టర్) పేషెంట్ కండీషన్ బట్టి తగిన మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత పేషెంట్ శ్వాస తీసుకోవడం ఆగిపోయి, కండరాల పనితనం ఆగిపోతుంది. అప్పుడు పేషంట్‌కు కృత్రిమ శ్వాస అందిస్తూ కావల్సిన పైపులు వేసుకుని ఆపరేషన్ మొదలు పెడతారు. తిరిగి పేషెంట్ స్పృహలోకి వచ్చి సొంతంగా శ్వాస తీసుకునే సమయం వరకు కృత్రిమ శ్వాస అందిస్తూనే ఉండాలి.నియోవెక్ ఇంజక్షన్ ఆపరేషన్ థియేటర్ నుంచి ఎలా వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది. థియేటర్ అసిస్టెంట్ (కాంపౌండర్ ) డాక్టర్‌కు తెలియకుండా దొంగిలించాడా.? ఒక వేళ అలా జరిగితే ఖచ్చితంగా డాక్టర్ పోయిన ఇంజక్షన్‌లపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఒక్కొక్క ఇంజక్షన్ ధర 10ఎంజీ అయితే రూ.188, అదే 4ఎంజీ అయితే రూ.72 ఉంటుంది. తక్కువ ధరనేగా అని ఇంజక్షన్‌లు మాయమైనా డాక్టర్ పట్టించుకోలేదా ? లేక ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ డైరెక్ట్‌గా మరెవరి దగ్గరైనా డాక్టర్ పేరు చెప్పి కొనుగోలు చేశారా? అలా చేస్తే ఎవరు ఇచ్చారు..? ఎందుకు ఇచ్చార న్నది తెలుసుకోవాల్సి ఉంది.కాగా ఈఘటన మరువక ముందే తాజాగా ఓగర్బిణిని కట్టుకున్న మొగుడే ఇంజక్షన్ తో హత్య చేశాడు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు మరెన్ని జరుగుతాయో అని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

 

Tags: How are narcotic injections administered?

Post Midle

Leave A Reply

Your email address will not be published.