గ్యారంటీలను కాంగ్రెస్ఎట్లా అమలు చేస్తది

కొడంగల్ ముచ్చట్లు:

 

కర్ణాటకలో లేని గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎట్లా అమలు పరుస్తుందని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు అయన కొడంగల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  దేశంలోఎక్కడా లేనివిధంగా  24 గంటలు కరెంటు, ఎకరాకు 16,000 పెట్టుబడి సహాయం, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చే బీఆర్ఎస్ పార్టీని, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ని మరోసారిగెలిపించండి. మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన మహిళలందరికీ జనవరి నుండి 3000 ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు.పదిమందికి సేవ చేసే వ్యక్తిగా గత ఐదు ఏళ్ళు మీ సేవకుడిగా పని చేసిన నరేందర్ రెడ్డికి ఓటు వేసి మరో మారు గెలిపిస్తే మరో ఐదేళ్లపాటు మీ సేవకుడిగా పని చేస్తాడని అన్నారు.

 

Tags; How Congress enforces guarantees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *