ఇంకా ఎంత మంది బలి కావాలి..

Date:19/09/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్‌ మల్కాజిగిరిలో ఓ బాలిక నాలాలో పడి చనిపోయిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ క్లాస్‌లు అయిపోయాక ఆడుకొనేందుకని రోడ్డుపైకి వెళ్లిన బాలిక ప్రమాదవశాత్తు నాలాలో పడి కొట్టుకుపోయింది. దాదాపు రెండు కిలో మీటర్ల దూరంలో శవమై తేలింది. ఈ ఘటన నగరంలో సంచలనం రేపింది. అయితే, తాజాగా ఈ విషయంపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి స్పందించారు. ఫేస్‌బుక్, ట్విటర్ వేదికగా కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.‘‘కేసీఆర్ గారూ… మీ సర్కారు నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు బలైపోవాలో చెప్పండి. సికింద్రాబాద్‌లో వర్షాలకు పొంగిపొర్లిన దీనదయాళ్‌నగర్‌ ఓపెన్ నాలాలో సుమేధ అనే 12 ఏళ్ళ విద్యార్థిని జీవితం కరిగిపోయింది. విశ్వనగరం చేస్తామంటూ మీరు చెప్పుకుంటున్న జంటనగరాల్లో వర్షాలు పడినప్పుడల్లా నాలాలు, డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ కనిపించనంతగా నీరు నిండిపోయి ఎన్ని ప్రాణాలు బలైపోయాయో లెక్క తీస్తే ఒక గిన్నిస్ రికార్డు అవుతుంది. ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడల్లా మీ పార్టీ నేతలు రావడం.. ఇలా జరక్కుండా చూస్తామని హామీలిచ్చి వెళ్ళిపోవడం మామూలైపోయింది.’’‘వర్షాలు పడినప్పుడల్లా హైదరాబాదులోని పలు ప్రాంతాలు నీట మునిగిపోవడం పాత ప్రభుత్వాల పుణ్యమేనని గతంలో మీరు ఎన్నోసార్లు విమర్శించారు. మరి గడిచిన ఆరేళ్ళ కాలంలో మీ ప్రభుత్వం చేసిందేంటి? ఇప్పుడు రాష్ట్రంలోని పలు ఇతర పట్టణాలు, నగరాలు హైదరాబాదు నగరానికి తోడవుతున్నాయి. అడుగడుగునా కబ్జాలు, అక్రమ కట్టడాలతో ఆ ప్రాంతాలు కూడా చినుకు పడితే చాలు మునిగిపోయే పరిస్థితి నెలకొంది. ప్రజల ఆగ్రహ వెల్లువలో మీరూ కొట్టుకపోకముందే మేలుకుని పరిస్థితిని చక్కదిద్దండి.’’ అని విజయశాంతి విమర్శలు చేశారు.

స్వార్ధం కోసం వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు

Tags: How many more people need to be sacrificed ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *