చెప్పింది ఎన్ని.. చూపించింది ఎన్ని??

Date:18/09/2020

చెప్పింది ఎన్ని.. చూపించింది ఎన్ని??ఇది గ్రేటర్ ప్రజల్ని మోసం చేయడమే

నాకు చూపించింది కేవలం 3,248 ఇండ్లు మాత్రమే

సీఎల్పీ నేత బట్టి విక్రమార్క

హైదరాబాద్ ముచ్చట్లు

గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష ఇండ్లు చూపిస్తానని శాసనసభ సాక్షిగా చెప్పిన మంత్రి శుక్రవారం రంగారెడ్డి జిల్లా.. మహేశ్వరం నియోజకవర్గంలోని మహాంకాల్ గ్రామంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను చూపించడం విడ్డూరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  అన్నారు. తుక్కుగూడ, మహేశ్వరం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో లేవు.. అక్కడ కట్టిన ఇండ్లను.. గత ఎన్నికలప్పుడు స్థానికులకు ఇస్తామని వారికి అధికార పార్టీ నేతలు హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  లక్ష ఇండ్లు చూపించమంటే… గ్రేటర్ హైదరాబాద్ లో చూపించలేదుక.. బయట జిల్లాల్లోని, బయట మునిసిపాలిటీల్లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు చూపించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇది ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను మోసం చేయడమేననిి భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటివరకూ గ్రేటర్ లో చూపిచింది.. కేవలం 3,428 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మాత్రమేనని భట్టి స్పష్టం చేశారు. ఎన్నికలప్పుడు రూరల్ ప్రజలను.. ఇప్పుడు గ్రేటర్ ప్రజలను టీఆర్ఎస్ మోసం చేసే ప్రయత్నం చేస్తోందని అన్నారు.

 

ఆలయాలపై దాడులు….కేంద్రమంత్రి అమిత్ షా కు వినతి పత్రం

Tags:How many said .. how many showed ??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *