ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలి-వైఎస్ షర్మిల

మెదక్ ముచ్చట్లు :

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం  శేరిల గ్రామంలో వైఎస్ షర్మిల పర్యటించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ లు లేక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. షర్మీనా మాట్లాడుతూ తెలంగాణ లో ఉన్న ప్రస్తుత స్థితి గతులు ఉద్యమ లక్ష్యాలకు దరి దాపులు లో కూడా లేవు. రాష్ట్రం వచ్చి ఏడూ ఏళ్ళు ఆయిన యువకులు చావే దిక్కు అనుకొంటున్నారు. ప్రతి నిరుద్యోగి ఆశగా ఎదురు చూస్తున్నది ప్రభుత్వ ఉద్యోగాలు కోసం, పాలకులు వారి నుదుట పై మరణ శాసనం రాస్తున్నారు. తెలంగాణా ఏర్పడి ఏడు ఏళ్ళు అయింది,కోట్ల మంది తెలంగాణా ప్రజలకు పండుగ రోజని అన్నారు.

 

 

ఎంత మంది ఆత్మహత్య లు చేసుకుంటే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది. సీఎం వాళ్ళ పిల్లలు కు ఉద్యోగాలు ఇచ్చారు, వీళ్లకు ఎందుకు ఇవ్వరు. ఛాతి లో ఉన్నది గుండె నా? బండ నా. దేశం లో ఉన్న నిరుద్యోగులు లో తెలంగాణ లోనే అత్యధికులు ఉన్నారని ఆమె అన్నారు.
నిరుద్యోగ భృతి ఏమి అయింది. కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చాల్సిన అవసరం ఉంది. అరవై ఏళ్ల ఉద్యమ ఫలితమే తెలంగాణ రాష్ట్రము. 1200 మంది అమరుల త్యాగాలు ను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయుష్మాన్ భారత్ దిక్కు మాలిన పధకం అని చెప్పిన సీఎం ఇప్పుడు అందులో చేరుతున్నారు. ఉద్యమం ఇంకా ఉంది, పోరాడి  సాధించుకోవాలని అన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: How many should commit suicide-YS Sharmila

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *