How to give a baby ....

ఏమిలేనోడికి బిడ్డను ఎలా ఇస్తా….

Date:13/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటిలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నోడికి ఏముందని నా బిడ్డను ఇచ్చేది…. …ప్రేమించినంత మాత్రాన నా బిడ్డను ఇవ్వాలని రూల్‌ ఉందా…… అని బాలిక తండ్రి అడ్డు చెప్పినా …ప్రేమ ముందు తల్లిదండ్రులు జాంతనై అంటు ఆ ప్రేమజంట వివాహం చేసుకుని నేడు ఆదర్శంగా నిలిచారు. పుంగనూరు పట్టణానికి చెందిన బి.నరేంద్రరాజు మున్సిపాలిటిలో రెవెన్యూ ఇన్స్స్పెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు 1996 సంవత్సరంలో కర్నాటకాకు చెందిన ఎస్‌ఐ గోపాలక్రిష్ణ కుమార్తె శిల్పా బంధువులు ఇంటికి వచ్చేది. అలా పుంగనూరుకు వచ్చివెళ్తుండగా ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. వీరిద్దరు ప్రేమలో పడ్డారు. కులాలు ఒకటైనా పట్టింపులతో ప్రేమజంటను విడదీశారు. మున్సిపాలిటిలో తాత్కాలిక ఉద్యోగికి బిడ్డను ఇచ్చేది లేదని, బాలికతండ్రి ఎస్‌ఐ బీష్మీంచుకున్నాడు. ఏడాది పాటు ప్రేమజంట పోరాటం సాగించారు. చివరకు ప్రేమే జయించింది. 1997 సంవత్సరం జూన్‌ 27న అతికష్టం మీద వివాహం జరిగింది. అదే ఏడాది నరేంద్రరాజుకు ఉద్యోగం పర్మినెంట్‌ అయింది. దీంతో ఆకుటుంబంలో సంతోషానికి అవదులు లేకుండ పోయింది. ఇద్దరు కుమారులు పునీత్‌రాజు, మనోజ్‌రాజుతో ఆప్రేమజంట సంతోషంగా జీవిస్తూ, ఆదర్శంగా నిలిచారు. ప్రేమకు కులాలు, మతాలు , ఉద్యోగాలు అడ్డురావని నిరూపించుకున్నారు నరేంద్ర, శిల్పా దంపతులు.

సమాజసేవ లో ప్రేమలోపడి పెళ్లిచేసుకున్నాం

Tags: How to give a baby ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *